పెళ్ళైన 24 రోజులకే.. ఇలా జరిగిందంటే?

praveen
మృత్యువు ఎప్పుడు ఎటువైపు నుంచి దూసుకువచ్చి ప్రాణాలను తీస్తుంది అన్నది ఎవరూ చెప్పలేని విధంగా ఉంటుంది. అదంతా తెలిస్తే మనం మనుషులం ఎందుకు అవుతాము.. దేవుడు ఆడించే జీవితం అనే వింత నాటకంలో కొన్ని కొన్నిసార్లు ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోవడం లాంటి ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి. అంతా సంతోషంగా ఉంది అనుకుంటున్న సమయంలో మృత్యువు చివరికి ప్రాణాలను తోడేస్తు ఉంటుంది. దీంతో ఎన్నో కుటుంబాల్లో విషాదం నిండి పోతూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏ యువతి అయినా సరే పెళ్లి తర్వాత కొత్త జీవితం ప్రారంభించాలని కోటి ఆశలు పెట్టుకుంటుంది.


 ఆ ఆశలతోనే మెట్టినింట్లో అడుగుపెడుతూ భర్తతో హాయిగా జీవించాలని అనుకుంటుంది. కానీ కొంతమంది వైవాహిక బంధంలో ఊహించని ఘటనలు విషాదాన్ని నింపుతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. బంధువుల ఇంట్లో వేడుకకు హాజరై తిరుగు పయనమైన సమయంలో నవవధువు మృత్యువాత పడింది. కృష్ణాజిల్లా నందిగామ మండలం అంబర్ పేట లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మధు అనే యువకుడికి సదా అనే యువతితో వివాహం ఫిబ్రవరి 14వ తేదీన వివాహం జరిగింది. ఇక వివాహం తర్వాత భార్య భర్తలు ఇద్దరూ కూడా ఎంతో అన్యోన్యంగా సంతోషంగానే ఉన్నారు.



 ఇకపోతే ఇటీవల గంపలగూడెం మండలం చింతలలో బంధువుల ఇంట్లో వేడుక జరిగగా అక్కడికి వెళ్లారు ఈ నూతన వధూవరులు. ఇక అక్కడ వేడుక పూర్తి చేసుకుని ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలోనే ఖమ్మం జిల్లాలోని మధిర మండలం రాయపట్నం సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో చివరికి బైక్ అదుపు తప్పి కింద పడిపోయింది. ఇక ఈ ఘటనలో సదా తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఆ యువతిని అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అయితే బంధువుల ఇంటి నుంచి బయలుదేరి రెండు కిలోమీటర్లు కూడా దూరం పోకముందే ఈ రోడ్డు ప్రమాదం జరగడం గమనార్హం. ఇక పెళ్లయిన కొన్నాళ్లకే ఇలాంటి విషాదకర ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు.. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: