సవతి తల్లి టార్చర్.. రోజు బాలుడుతో ఏం చేయిస్తుందో తెలుసా?
11 ఏళ్ళ బాలుడిని చక్కగా బడికి పంపించి చదివించాల్సిన సవతి తల్లి ఆ బాలుడి విషయంలో దారుణంగా వ్యవహరించింది. 11 ఏళ్ల బాలుడు తో వెట్టి చాకిరి చేయిస్తూ డబ్బులు సంపాదిస్తోంది. ఇక బాల్యంలోనే ఆ బాలుడు భుజాలపై మోయలేని బాధ్యతలను మోపింది. మల్లేపల్లి లో నివాసముండే శ్రీనివాస్ శ్వేత దంపతుల కుమారుడు పదకొండేళ్ల ఉదయ్ కుమార్ ఉన్నాడు. నాలుగేళ్ల క్రితమే శ్వేత అనారోగ్యంతో మరణించింది. దీంతో తన కొడుకుకూ తల్లి ప్రేమను దూరం చేయ కూడదు అనే ఉద్దేశంతో అబ్దుల్ గంజ్ కు చెందిన ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు శ్రీనివాస్. కానీ సవతి తల్లి ప్రేమ చూపించకుండా కర్కశంగా ప్రవర్తించింది.
11 ఏళ్ల వయసులో ఉన్న ఆ బాలుడిని చదువుకోవడానికి పంపించకుండా వెట్టిచాకిరీ చేయించడానికి సిద్ధమైంది. భిక్షాటన కోసం పంపి రోజుకు 500 రూపాయలు తెచ్చి ఇవ్వాలంటూ కండిషన్ పెట్టింది. ఇక చేసేదేమిలేక బాలుడు రోజు భిక్షాటన చేస్తూ 500 తెచ్చి ఇచ్చే వాడు. ఏ రోజైనా డబ్బులు తక్కువ అయితే ఏకంగా కర్రలు కాల్చి వాతలు పెట్టడం చేసేది.. మొదట్లో సవతి తల్లి చిత్రహింసలు పెడుతుంటే అడ్డుకునే వారు. కానీ ఆ తర్వాత కాలంలో పట్టించుకోవడం మానేశాడు తండ్రి. దీంతో ఇక సవతి తల్లికి రోజు 500 రూపాయలు తెచ్చేందుకు ఉదయ్కుమార్ పడని కష్టం అంటూ లేదు. ఇక ఇదంతా చూసి ఏకంగా చుట్టుపక్కల వారి మనసు కరిగిపోయింది. ఈ క్రమంలోనే ఒక స్వచ్ఛంద సంస్థకు సమాచారం అందించగా.. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు రాజేంద్ర కుమార్ అనే వ్యక్తి ఆ బాలుడి బాధ్యతను చూసుకునేందుకు సిద్ధమయ్యాడు..