దారుణం : ప్రియుడిని కట్టేసి మరి అత్యాచారం?
ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఫిషింగ్ హార్బర్ చూసేందుకు వెళ్లిన ఒక ప్రేమజంటపై దాడి చేసిన కామందులు ఏకంగా ప్రియుడిని తాళ్లతో కట్టేసి అతని కళ్ల ముందే యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని బందరులో వెలుగులోకి వచ్చింది. ఇక విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు బందరు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలోనే లైంగిక దాడికి పాల్పడ్డ నాగబాబు అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే మచిలీపట్నంలో ఓ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగిన ఘటన సంచలనం గా మారిపోయింది.
ఇటీవలే ఓ విద్యార్థిని తన ప్రియుడితో కలిసి బీచ్ కి వెళ్ళింది. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో వారి వద్దకు ఇద్దరు మందుబాబులు వచ్చారు. ఇక మొదట ఇక్కడ ఏం చేస్తున్నారు అంటూ వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ప్రియుడిని తాళ్లతో చెట్టుకు కట్టేశారు. ఇక విద్యార్థినిపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. అయితే ఈ విషయం ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ ప్రేమజంట సైలెంట్ గానే ఉండిపోయింది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఎంతో బాధ పడిపోతున్న కూతుర్ని గమనించిన తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో అసలు విషయాన్ని చెప్పింది. ఈ క్రమంలోనే బాధిత యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నాగబాబు అనే వ్యక్తి పై కేసు నమోదు చేశారు మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు..