మహిళా దినోత్సవం రోజే.. ఇంత ఘోరం జరిగిందా?
దీన్నే తమకు అనుకూలంగా మార్చుకోవాలి అనుకున్నారు కామాంధులు. ఇక ప్లాన్ ప్రకారమే విదేశీ మహిళకు మాయ మాటలు చెప్పి కాస్త దగ్గరయ్యారు. చివరికి అత్యాచారం యత్నం చేశారు. లిథువేనియా కు చెందిన మహిళ గోవా వెళ్లేందుకు శ్రీలంక నుంచి చెన్నై చేరుకుంది. బెంగళూరు వస్తుండగా బస్సులో నెల్లూరు జిల్లాకు చెందిన సాయి పరిచయమయ్యాడు. గోవా మిస్సయిన పర్వాలేదు కానీ కృష్ణాపురం మాత్రం తప్పనిసరిగా చూడాలి అంటూ మాయ మాటలు చెప్పి నమ్మించాడు. ఈ క్రమం లోనే మహిళతో కలిసి గూడూరుకు చేరుకున్నారు సాయి కుమార్.
ఇక అక్కడే కాపుకాసి ఉన్న మరో స్నేహితుడితో కలిసి సైదాపురం అడవిలో విదేశీ మహిళపై అత్యాచారయత్నం చేశాడు. కానీ వారి వక్రబుద్ధి ని పసిగట్టిన ఆమె చాకచక్యంగా వ్యవహరించి యువతుల బారి నుంచి తప్పించుకుంది.. కేకలు వేస్తూ పరుగులు తీసి రోడ్డు పైకి చేరింది. ఇక ఆమె అరుపులు విని కొంత మంది ప్రయాణికులు పోలీస్ స్టేషన్ లో ఆమెను అప్పగించారు. మహిళ దగ్గర సాయి కుమార్ ఆధార్ కార్డు పాన్ కార్డు గుర్తించారు. ఈ కేసును సవాల్‌గా తీసుకుని పోలీసులు ఆరు గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేయడం గమనార్హం..