ప్రేమకు పెద్దలు ఒప్పుకున్నారు.. అయినా చనిపోయారు?
ఇక్కడ మాత్రం ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని ముంబైలో వసాయ్ కు చెందిన అరుణ్ నాయర్, సయని ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం పెద్దలకు తెలిసింది. కుటుంబ సభ్యులు కూడా పెద్దమనసు చేసుకుని ఇక ఇద్దరి ప్రేమ వివాహానికి ఒప్పుకున్నారు. తన ఇంట్లో విషాదం. ఏం జరిగిందో తెలియదు వేరు వేరు చోట్ల ఇద్దరు విగతజీవులుగా కనిపించారు. ఇటీవలే ఫిబ్రవరి 27వ తేదీన హోటల్లో ఈ జంట దిగింది. తర్వాత రోజు రూమ్ నుంచి ఎవరు బయటకు రాలేదు. సిబ్బంది తలుపులు కొట్టిన తీయలేదు.
దీంతో ఏం జరిగి ఉంటుందా అని తలుపులు బద్దలు కొట్టి చూశారు. లోపల సయాని విగతజీవిగా కనిపించింది. ప్లంబింగ్ పనిముట్లతో ఆమెను గాయపరిచి నట్లు గుర్తించారు పోలీసులు. అరుణ్ నాయర్ కనిపించకుండా పోవడంతో ఇక అతని పై అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఒక వారం తర్వాత బీహార్ లోని ఒక హోటల్లో గదిలో శవమై కనిపించాడు అతను. అయితే సయాని మరణం తర్వాత అరుణ్ బీహార్ పారిపోయాడని ఇక ముజఫర్‌పూర్‌లో ఆస్తా హోటల్లో దిగారని.. తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఇక పోలీసులు వచ్చి డోర్ బద్ధలు కొట్టి చూస్తే లోపల అరుణ్ మృతదేహం కనిపించిన ట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..