బాబాయ్ తో అక్రమ సంబంధం.. భర్త చూడటంతో?

praveen
ఇటీవల కాలంలో అక్రమ సంబంధాలు పంచ్చటి కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి అన్న విషయం తెలిసిందే. కట్టుకున్న బంధానికి కాస్తయినా విలువ ఇవ్వని మనుషులు  క్షణికావేశంలో ఏకంగా పరాయ్ వ్యక్తుల మోజులో పడి పోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ఇలా అక్రమ సంబంధాల కారణంగా కట్టుకున్న భర్త కంటే ప్రియుడే ముఖ్యం అని భావించి చివరికి కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చిన ఘటనలు సభ్యసమాజాన్ని ఉలిక్కి పడేలా చేస్తూ ఉన్నాయి. ఇలా ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో పోతున్న ప్రాణాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.



 ముఖ్యంగా మానవతా విలువలకు వావి వరసలకు విలువ ఇవ్వని మనుషులు దారుణంగా అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఏకంగా తండ్రి తరువాత తండ్రి లాంటి బాబాయ్ తో అక్రమ సంబంధానికి తెరలేపింది ఇక్కడ ఒక వివాహిత. అయితే భర్తకు తెలియకుండా ఎన్నో రోజుల పాటు రాసలీలలు కొనసాగిస్తూ వచ్చింది. కానీ ఆ తర్వాత కట్టుకున్న భర్తకు ఈ విషయం తెలిసింది. దీంతో ప్రియుడితో పడక సుఖానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించి కనికరం లేకుండా భర్తను హత్య చేసింది.


 ఖమ్మం జిల్లా వైరాలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. నిరోషా అనే మహిళ వరసకు బాబాయి అయ్యే మాడుగుల కృష్ణ తో తన అక్రమ సంబంధానికి తెరలేపింది. ఈ క్రమంలోనే ఇటీవల నిరోష కృష్ణతో ఏకాంతంగా ఉన్న సమయంలో ఇంటికి వచ్చిన భర్త వారిని అసభ్యకర రీతిలో చూశాడు. దీంతో కోపంతో ఊగిపోయిన భర్త భార్యతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే భార్య ప్రియుడు కృష్ణ తన్నడం తో కిందపడిపోయాడు. వెంటనే నిరోషా రోకలిబండతో భర్తను కొట్టింది. దీంతో స్పృహ కోల్పోయాడు.  తర్వాత దుప్పటితో జయరాజు నోటిని అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి చివరికి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: