కోడలిపై కన్నేసిన మామ.. కాళ్ళు నొక్కమనే సాకుతో?
చివరికి కోడలిపై కామవాంఛలు తీర్చుకోవాలని అనుకున్నాడు. ఇక మంచివాడిగా నటించి అదును చూసి మనసులో ఉన్న నీచ ఆలోచనలు బయటపెట్టాడు. ఇక మామ తీరుతో షాక్ అయిన కోడలు ఎదురు తిరిగే సరికి దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హర్యానాలోని పాల్వాల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. అలీగడ్ రోడ్డులోని కిల్వాది కాలనీలో పెళ్ళయిన యువతీ మెట్టినింట అడుగుపెట్టింది. అయితే ఇలా ఇంట్లో కి వచ్చిన కోడలు పై కన్నేశాడు మామ. ఇక కోడలు రజిని కన్న కూతురిలా చూసుకోవాల్సింది పోయి చివరికి మనసులో ఉన్న నీచ ఆలోచన బయటపెట్టాడు మోహన్ సింగ్. కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి నొక్కమని చెప్పి అసభ్యకర పనులు చేసేవాడు.
వద్దు అంటూ కోడలు ఎంత బ్రతిమిలాడిన కానీ కరుణించని మామ.. కామవాంఛ తీర్చమని ఒత్తిడి చేసేవాడు. ఈ క్రమంలోనే భర్తకు ఈ విషయాన్ని చెప్పింది కోడలు. అయితే ఇక మామ చేసిన పని కరెక్టే అంటూ అత్త కూడా వంత పాడటం తో కోడలు మరింత షాక్ అయింది. ఇక ఈ విషయం కట్టుకున్న భర్త కు చెబితే... పరువు పోతుంది నోరు మూసుకొని కూర్చో అంటూ బెదిరించాడు.. దీంతో తట్టుకోలేకపోయిన సదరు యువతి ఎదురుతిరిగింది. అయితే ఈ క్రమంలోనే మామ పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు.. ఎంత వేధించినా కోడలు లొంగకపోయేసరికి చివరికి ఆమెను దారుణంగా కాల్చి చంపాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.