భార్య న్యూడ్ ఫోటోలు తీసి భర్త బ్లాక్ మెయిల్.. దేని కోసమో తెలుసా?
ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. సాధారణంగా కట్టుకున్న భర్త భార్యకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు. భార్య విషయంలో ఎవరైనా వ్యక్తులు అసభ్యంగా ప్రవర్తిస్తే వారికి సరైన బుద్ధి చెబుతూ ఉంటాడు అనుక్షణం భార్య కు రక్షణగా నిలబడతాడు. కానీ ఇక్కడ ఒక భర్త మాత్రం ఏకంగా భార్య పాలిట శాపం గా మారిపోయింది. ఇక కట్టుకున్న భార్యను చిత్రహింసలకు గురి చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. చివరికి ఎవరూ చేయకూడని పని చేసి నీచాతి నీచానికి ఒడిగట్టాడు భర్త.
భార్య న్యూడ్ ఫోటోలు వీడియోలు తీసి ఇక వాటిని సోషల్ మీడియాలో పెడతాను అంటూ కట్టుకున్న భార్యను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. బెంగుళూరులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. హనుమంత్ నగర్ ప్రాంతానికి చెందిన ప్రగత్ పురుషోత్తం కు ఇటీవలే పెళ్లి జరిగింది. అయితే పెళ్లి సమయంలో అత్తమామలు అతనికి భారీగా కట్నకానుకలు సమర్పించారు. అరకిలో బంగారం 15 కిలోల వెండి భారీగా డబ్బు కూడా అందజేశారు. కానీ కొన్నేళ్లలోనే అదనపు కట్నం కావాలి అంటూ భార్య ను వేదించడం మొదలు పెట్టాడు. భార్య న్యూడ్ వీడియోలు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించడంతో.. ఆ వివాహిత తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో మరోసారి 40 లక్షల సమర్పించారు. కానీ అంతటితో ఆగకుండా ఆస్తిలో వాటా ఇవ్వాలని వేధింపులకు పాల్పడ్డాడు. వేధింపులు భరించలేక పోయిన భార్య పోలీసులను ఆశ్రయించింది..