ఎఫైర్.. ఒకే గదిలో ముగ్గురు.. చివరికి?
ఇలా ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఊహించని పరిణామాలకు దారి తీస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ వివాహేతర సంబంధం ఒక వ్యక్తి దారుణ హత్యకు దారితీసింది. నందిగామ పట్టణంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇటీవలే తెల్లవారుజామున ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన గుత్తికి ఉషా కొన్నేళ్లుగా సహజీవనం చేస్తూ ఉన్నారు.. ఈ క్రమంలోనే ఇటీవల నందిగామ లోని ఒక గ్రామంలో పని చేసేందుకు వచ్చారు ఇద్దరు.
ఈ క్రమం లోనే ఉషకు అప్పాజీ అనే వ్యక్తితో కొంత కాలం క్రితం పరిచయం ఏర్పడింది.. ఇక ప్రస్తుతం ముగ్గురు కలిసి ఒకే గది లో ఉంటున్నారు. ఇటీవలి కాలం లో ఉష అప్పాజీ తో కూడా ఎంతో చనువు గా ఉంటుంది. అయితే ఇది నచ్చని విజయ్ తీరు మార్చుకోవాలి అంటూ హెచ్చరించాడు. అయినప్పటికీ ఆమె మాత్రం వినకపోవడం తో చివరికి అప్పాజీ గొంతును కత్తితో దారుణం గా కోసి హత మార్చాడు. అడ్డొచ్చిన ప్రియురాలికి కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..