ఆర్మీ జవాన్ అయ్యుండి.. ఇదేం పని?
కాగా ఈ కేసు లో నిందితుడిగా ఉన్న సదరు వ్యక్తి కేరళకు చెందిన సతీష్ గా గుర్తించారు పోలీసులు. ఇక పక్కా సమాచారం మేరకు మహారాష్ట్ర లోని థానే జిల్లా లో పోలీసులు సతీష్ ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడం గమనార్హం. అయితే 2019 ఫిబ్రవరిలో కళ్యాణ్ -కసరా స్పెషల్ స్టేషన్ మధ్య గోవా - నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న మహిళలపై వేధింపులకు పాల్పడ్డాడని.. ఇటీవలే పి టి ఐ నివేదిక పేర్కొంది. బాధితురాలు ఉన్న కంపార్ట్మెంట్ లోనే ఆర్మీ జవాన్ సతీష్ ప్రయాణించాడని పోలీసులు చెబుతున్నారు.
తనపై జరిగిన అత్యాచారం గురించి బాధితురాలు భారత రాయబార కార్యాలయం లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. భారత రాయబార కార్యాలయం ఇక ఈ కేసు విచారణ కోసం కళ్యాణ్ రైల్వే పోలీస్ స్టేషన్కు కేసు అప్పగించింది. అయితే సిసిటివి ఫుటేజీ విదేశీయురాలు అందించిన వివరాలను పరిశీలించిన తర్వాత ఆమె చెప్పింది నిజమే అన్నది తేలింది. ఈ క్రమం లోనే నిందితుడిని అదుపు లోకి తీసుకున్నారు పోలీసులు. అయితే అతని కోసం పోలీసులు వెతుకుతున్నారు అని తెలుసుకున్న నిందితుడు సతీష్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. కానీ కోర్టు అతని బెయిలు పిటిషన్ను కొట్టివేసింది.