ప్రేమికులు ఒకప్పుడు హగ్ చేసుకోవాలని అన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించే వాళ్ళు..పెళ్ళి చేసుకుంటేనే టచ్ లేకుంటే నో అనే ధోరణిలో ఉండేవాళ్ళు.కానీ ఇప్పుడు ప్రేమకు పూర్తిగా అర్థాన్ని మార్చేశారు.కేవలం పడక గదిలో దొరికే కాసేపు సుఖం కోసం ప్రేమికులు ఆసక్తి చూపిస్తున్నారు.. అందుకే పెళ్ళికి ముందే అన్నీ చేసుకొని పెళ్ళి మాట రాగానే మొహం ఛాటేస్తున్నారు. ఇది వాస్తవం. విషయాన్నికొస్తే.. ఇద్దరు లవర్స్ ఏకాంతంగా గడిపేందుకు ఓ హోటల్ కు వెళ్లారు. అయితే ఆమెకు ఓ వ్యక్తి నుంచి
ఫోన్ రావడంతో అనుమానంతో ప్రియుడు అతి దారుణంగా చంపెసాడు.
వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన శివమ్ చౌహాన్, ఢిల్లీలోని కిశన్‌గఢ్‌కు చెందిన ఓ యువతి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ ఏకంతంగా కలుసుకునేందుకు ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఓ హెటల్‌కు వచ్చారు. వాళ్ళు హోటల్ కు రాగానే యువతికి ఓ వ్యక్తి వరుసగా కాల్స్ చేశాడు. దీంతో శివమ్,ఎవరూ అని ప్రశ్నించగా తన సోదరి ప్రియుడు అని చెప్పింది. ఆమె మాటలు నమ్మని అతను గట్టిగా నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఆమె చెప్పిన సమాధానం అతనికి నచ్చలేదు. దాంతో కోపంతో ఊగిపోయాడు. ఆమె తలను నేలకేసి బలంగా కొట్టాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మరుసటి రోజు చౌహాన్ ఒక్కడే రూమ్ నుండి బయటకు వెళ్లిపోగా.. డెడ్ బాడీని గుర్తించిన హెటల్ సిబ్బంది ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. అక్కడికి చేరుకున్న కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ
టీవీ కెమెరాల ఆధారంగా శివమ్‌ను పట్టుకున్నారు. తన ప్రియురాలు తనను మోసం చేసి ఉత్కర్ష్ అనే మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్నట్టు చెప్పాడు. అందుకే తాను ఆమెను
హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు.. మొత్తానికి ఇది వైరల్ అవుతుంది.