స్మగ్లర్లు కొత్త ఐడియా.. 'పుష్ప'లా ట్రై చేశారు.. కానీ?

praveen
సినిమాలు చూసి జనాలు ఎక్కువగా ప్రభావితం అవుతారు అన్నది ఇప్పుడు అర్థమవుతోంది. ఇటీవలే అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సూపర్ హిట్ అయింది. గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. పోలీసులకు దొరకకుండా గంధపు చెక్కలను అక్రమంగా స్మగ్లింగ్ లింక్ చేయడం ఎలా అని ఈ సినిమాలో చూపిస్తూ ఉంటారు. ఇక ఈ సినిమాను చూసి నేటి రోజుల్లో ఎంతో మంది అక్రమార్కులు బాగా స్ఫూర్తి పొందారు అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రై చేసినట్లుగానే ఇక నిజజీవితంలో కూడా అక్రమాలకు పాల్పడినందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.


 ఈ క్రమంలోనే ఇటీవలే ఆగ్రా నుండి మద్యాన్ని ఉత్తరప్రదేశ్లో ఎన్నికలకు అక్రమ రవాణా చేయడానికి స్మగ్లర్లు ఒక పుష్పలోని వ్యూహాన్ని కాపీ కొట్టడం గమనార్హం. ఇక స్మగ్లర్లు ఒక ట్యాంకర్ లోనీ ఒక క్యాబిన్ లో రసాయనం ఉంచడానికి ఉపయోగించగా.. రెండవది మద్యం డబ్బాలను రవాణా చేయడానికి ఉపయోగించారు. అయితే తూర్పు యూపీలో పోలింగ్ ముందు అక్రమ మద్యం సరఫరా అవుతుందని సమాచారం అందుకున్న పోలీసులు ఆగ్రాలోని హరి పర్బత్ వద్ద మద్యం స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 360 మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని హర్యానా నుంచి అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.


 అయితే కెమికల్ ట్యాంకర్ తీసుకు వెళుతుందన్న ఇక పోలీసులు ఎక్కువగా తనిఖీలు చేయరని నిందితులు భావించి ఇక అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించారు. అయితే కేవలం మహిళలే కాదు పోలీసులు కూడా పుష్ప సినిమా చూసే ఉంటారు కదా. ఈ క్రమంలోనే కాస్త క్షుణ్ణంగా పరిశీలించడం తో పైభాగంలో కెమికల్.. కింది భాగంలో ఇంకేదో ఉంది అన్న విషయాన్ని గ్రహించారు. చివరికి ఇక చెక్ చేయగా మద్యం అక్రమ రవాణా చేస్తున్నారు అన్న విషయాన్ని గుర్తించారు పోలీసులు. నిందితులను అరెస్టు చేశారు. అయితే గతంలో కూడా కొంత మంది అక్రమార్కులు పుష్ప సినిమా తరహాలోనే నేరాలకు పాల్పడేందుకు  ప్రయత్నించడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: