ముగ్గురు మహిళలు అరెస్ట్.. ఏం చేశారో తెలుసా?

praveen
ఇటీవలి కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మనుషుల తిరు ఎటువైపు వెళ్తుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఒకప్పుడు ఉన్న దాంట్లో సర్దుకుపోతూ సమాజంలో గౌరవంగా బ్రతకాలి అని అనుకునే వారు ప్రతి ఒక్కరు. కానీ నేటి రోజుల్లో మాత్రం ఉన్నదాంట్లో సర్దుకుపోవడం కాదు.. లేని దాన్ని కూడా పైకి ఉన్నట్లుగా చూపించి ధనవంతులం అని ఇతరులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు ఎంతోమంది. అంతేకాకుండా ఇక ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటూ గౌరవంగా బతకడం కంటే ఏదో ఒక విధంగా నేరాలకు పాల్పడి అయినా సరే భారీగా డబ్బులు దండుకుని జల్సాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు ఈ రోజుల్లో జనాలు.


 ఇలా ఇటీవలి కాలం లో వెలుగు లోకి వస్తున్న ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఇటీవలి కాలంలో కరోనా వైరస్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఎంతోమంది దొంగలుగా మారిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. బతుకు బండిని నడిపేందుకు  ఎక్కడ ఉపాధి దొరక్క పోవడంతో చివరికి కుటుంబ సభ్యుల కడుపు నింపేందుకు దొంగలుగా మారిన ఘటనలు ఎంతోమంది మనసును కదిలించాయి.  ఇక్కడ ముగ్గురు మహిళలు దొంగలుగా మారారు.  ముగ్గురు దొంగతనాలు చేయడానికి కారణం ఆర్థిక సమస్యలు కుటుంబ బాధ్యతలు కాదు జల్సాలు.


 కూలి పని చేయడం ద్వారా వచ్చే డబ్బు తన విలాసవంతమైన జీవితానికి సరిపోవడం లేదు అంటూ భావించిన మహిళలు చివరికి చోరీలు చేయడం మొదలు పెట్టారు. సీన్ రివర్స్ అయ్యి ఇక ఇటీవల పోలీసులకు పట్టు బడ్డారు  ఉమ్మడి కరీంనగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో చోరీలకు పాల్పడినట్లు పోలీసుల విచారణ లో తేలింది. రజిత అనే మహిళ తో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. ఇక ఈ కేసుపై విచారణ జరుపుతున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: