ఆడవాళ్ళకు ఆడ వాళ్ళే శత్రువులు అన్న సామెతకు సరిగ్గా సరిపోయేలా ఇప్పుడు మహిళలు మారుథున్నారు.. అదే విధంగా గొడవలు జరుగుతున్నాయి. నేరాల రేటులో మగవారితో పోలిస్తే మహిళలదే పై చెయ్యి. కనీసం కనికరం కూడా లేకుండా దాడులు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. పుట్టింటిలో ఉన్న కోడలిని తీసుకురావడానికి వెళ్ళిన అత్తకు కోడలి బంధువులు షాక్ ఇచ్చారు.. నచ్చచెప్పాలని అనుకున్న అత్తకు చుక్కలు చూపించారు.. బట్టలు విప్పదీసి కారం కొట్టారు.. ఇది నిజంగా దారుణం అనే చెప్పాలి.
వివరాల్లొకి వెళితే.. ఈ దారుణ ఘటనలు ఎక్కువగా నార్త్ లో జరుగుతున్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు ఇలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకుంటూన్నా కూడా ఇలాంటివి వెలుగు చూడటం బాధాకరం. ఇప్పుడు మరో భయంకర ఘటన వెలుగు చూసింది. రాజస్థాన్‌లో బయటకు వచ్చింది.. రాష్ట్రంలొని బార్మర్ జిల్లా కమతై గ్రామానికి చెందిన ఓ 45 ఏళ్ళ వయస్సు ఉన్న మహిళ తన కోడలి పుట్టింటికి వెళ్లింది. కోడలికి నచ్చ చెప్పి ఇంటికి తీసుకురావాలనుకుంది. అప్పుడు చాలా చర్చలు జరిగాయి. కొన్ని గొడవలు కూడా జరిగాయి.
ఈ మేరకు కోడలి తరఫు బంధువులతో చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో వారు ఈమె పై దాడికి తెగబడ్డారు. ఇద్దరు మహిళలు ఈమెను చితక్కొట్టారు.. ఆ తర్వాత ఆమె బట్టలూడదీసి జననాంగంపై కారం చల్లారు.. ఇది వినడానికి భయంకరంగా ఉన్నా కూడా ప్రస్తుతం ఈ దారుణ ఘటన కలకలం రేపుతోంది.. ఈ ఘటన ను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఆ వీడియో పోలీసుల వరకు వెళ్లడం తో వారు రంగంలోకి దిగారు. బాధిత మహిళ నుంచి స్టేట్‌మెంట్ తీసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. వీడియోను తీసిన వ్యక్తిని పట్టుకొనే పనిలో పోలీసులు ఉన్నారు.