
భర్తపై ఫిర్యాదు చేయటానికి వెళ్తే.. కానిస్టేబుల్ ఏం చేసాడో తెలుసా?
ఇక్కడ ఒక మహిళ భర్తతో విడిపోయింది. విబేధాలు రావడంతో చివరికి పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే అంతకుముందు ఇక భర్తతో విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది సదరు మహిళ. అయితే ఇలా పోలీస్ స్టేషన్కు వచ్చిన మహిళ పట్ల ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన కానిస్టేబుల్ ఇక చివరికి ఆ మహిళకు మాయమాటలు చెప్పి వివాహేతర సంబంధానికి తెరలేపాడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. నంజనగూడు తాలూకా పుల్లం పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇది కానిస్టేబుల్ గా పని చేస్తూ ఉంటాడు కృష్ణ అనే వ్యక్తి. ఇటీవలే భర్తతో విభేదాలు ఏర్పడటంతో గౌరమ్మ అనే మహిళా పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వచ్చింది.
అయితే ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళలు దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకునే కానిస్టేబుల్ కృష్ణ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తర్వాత మొబైల్ నెంబర్ తీసుకుని ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాడు. కానిస్టేబుల్ మాటలు నమ్మిన గౌరమ్మ భర్త నుంచి విడాకులు తీసుకుంది. చివరికీ గౌరమ్మను లోబరుచుకుని మైసూరులో కాపురం పెట్టాడు సదరు కానిస్టేబుల్. ఇక ఇటీవలే ఆమె పేరు మీద 5 లక్షల లోన్ కూడా తీసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత గౌరమ్మా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకురాగా అందుకు నిరాకరించాడు కృష్ణ. ఇక అంతేకాకుండా పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అంటూ చెప్పడంతో పోలీసులను ఆశ్రయించిన గౌరమ్మ ఫిర్యాదు చేసింది.