దారుణం : 65 ఏళ్ల వృద్ధుడి కామం.. 25 ఏళ్ల యువతికి గర్భం?
ఎక్కడో ఓ చోట ఆడపిల్లలపై అత్యాచారం ఘటన వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నల్గొండ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. 65 ఏళ్ల వృద్ధుడు 25 ఏళ్ల మానసిక వికలాంగురాలైన యువతీని మాయమాటలతో లోబరుచుకుని చివరికి కామవాంఛలు తీర్చుకున్నాడు. వృద్ధుడి కామానికి అభం శుభం తెలియని మానసిక వికలాంగురాలు గర్భం దాల్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా అందరినీ అవాక్కయ్యేలా చేసింది. భూదాన్ పోచంపల్లి మండలం లోని మోహన్ నగర్ లో ఘటన వెలుగులోకి వచ్చింది. మోహన్ నగర్కు చెందిన 25 ఏళ్ల యువతీ మానసిక వికలాంగురాలు.
తల్లిదండ్రులు మరణించడంతో ఒంటరిగానే ఉంటోంది. ఈమెకు ఇద్దరు అక్కలు ఉండగా వివాహం చేసుకొని వెళ్ళిపోయారు. ఇక ఆ యువతి ఒంటరిగా ఉండటమే తనకు అదునుగా మార్చుకున్న మల్లయ్య అనే 65 ఏళ్ల వృద్ధుడు ఆమెపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి దగ్గరయ్యాడు. ఇక ఆ తర్వాత లోబర్చుకుని శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. ఇక ఇటీవలే రంగారెడ్డి జిల్లా అనాజ్ పూర్ లో ఉంటున్న అక్క ఇంటికి వెళ్లిన సదరు యువతి శరీరంలో పలు మార్పులు గమనించిన బావా చివరికి వైద్య పరీక్షలు చేయించగా ఊహించరు నిజం బయటపడింది. సదరు యువతి గర్భవతి అన్న విషయం తేలింది. దీంతో యువతి ని గట్టిగా నిలదీయడంతో జరిగిన అన్ని విషయాలు చెప్పింది. ఇక యువతీ అక్క పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.