సైకో భార్య.. మాంసం కోసి కత్తితో.. దాన్ని రెండు ముక్కలు చేసింది?

praveen
ఇటీవలి కాలంలో మనుషులు క్షణికావేశంలో ఏకంగా ఉన్మాదులు గా  మారి పోయి సొంత వారి ప్రాణాలు తీస్తున్న ఘటనలు కోకొల్లలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కట్టుకున్న భార్య భర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలు ఏకంగా ఒకరిని ఒకరు హత్య చేసుకునేంత వరకు వెళుతున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. కట్టుకున్న భర్త పై కోపంతో ఊగిపోయిన భార్య మానవ మృగం గా మారిపోయింది. దాంపత్య బంధం గురించి కూడా ఆలోచించలేదు. ఇక కాస్తైనా కనికరం చూపించకుండా మాంసం కోసే కత్తి తో అతని పై దారుణంగా దాడి చేసింది..  ఏకంగా నూట నలభై సార్లు విచక్షణారహితంగా పొడిచి చివరికి ప్రాణాలు తోడేసింది. అంతటితో ఆగని ఆ సైకో భార్య  భర్త తలను రెండు ముక్కలుగా చేసింది.

 ఈ భయానకమైన ఘటన అగ్ర దేశమైన అమెరికా లో వెలుగులోకి వచ్చింది. ఫ్లోరిడాలోని ఫామ్ బీచ్ కౌంటీలో జాన్ బుర్కే,  మెలవిన్ వెల్లర్ భార్య భర్తలు ఉన్నారు. కాగా భర్త మెల్విన్ దివ్యాంగుడు.. అయితే ఇటీవల ఏం జరిగిందో తెలియదు గానీ.. భార్య తన భర్తను మాంసం కోసే కత్తితో పొడిచింది. 140 సార్లు కత్తితో పొడిచింది. అంతే కాదు భర్త కపాలాన్ని  రెండు ముక్కలుగా చేసింది. అయితే ఇది గమనించిన 41 ఏళ్ల కుమారుడు పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడ జరిగిన ఘటన చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

 ఈ క్రమంలోనే మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే పోస్టుమార్టంలో మొత్తంగా శరీరంపై 140 కత్తిపోట్లు  ఉన్నాయి అన్న విషయం తేలింది. అంతేకాకుండా మృతుడి కపాలం బాగా ఛిద్రమై పోయింది అన్న విషయం కూడా పోస్టుమార్టంలో తేలింది. పోస్టుమార్టంలో బయటకు వచ్చిన నిజాలతో  డాక్టర్లు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా భర్తను దారుణంగా హతమార్చిన భార్య ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  ఈ ఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం  ఈ ఘటనకు గల కారణాలు ఏంటి అన్న దానిపై విచారణ ప్రారంభించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: