జనాలకి సేవ చేయమంటే.. వాలంటీర్ ఏం చేశాడంటే?
ఎంతో బాధ్యతగా మెలగాల్సిన వాలంటీర్లు ఇటీవలికాలంలో ప్రజలను మోసం చేస్తూ చివరికి పోలీసులకు పట్టుబడిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఉన్న ఉద్యోగం చేసుకోకుండా అత్యాశకు పోతే ఏమవుతుంది అన్నది మాత్రం ఇక్కడ మరో సారి రుజువైంది.. గ్రామ వాలంటీర్ చేయాల్సిన పనులు మానేసి చిట్టీల పేరుతో ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టింది. ఇలా దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. కానీ ఆ తర్వాత మాత్రం డబ్బు మొత్తంతో పరార్ అయింది ఆ గ్రామ వాలంటీర్. విజయనగరం జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
విజయనగరం సాలూరు లోని చిట్లు వీధికి చెందిన రమ్య వార్డు వాలంటీర్ గా పనిచేస్తుంది గత కొన్ని ఏళ్లుగా తల్లి అరుణ తో కలిసి ఉంటున్న రమ్య ఇటీవలే పొదుపు చిట్టీల వ్యాపారం మొదలు పెట్టింది. మాయమాటలతో చుట్టుపక్కల వారందరికీ కూడా వీరిపై నమ్మకం వచ్చేలా చేసింది. దీంతో ఎంతో మంది ఇక రమ్య దగ్గర చిట్టీలు వేయడం మొదలుపెట్టారు. కానీ ఆ తర్వాత వీరి అసలు రంగు బయటపడింది. ఇక ఇలా చుట్టుపక్కల వారి నుంచి చిట్టీలు అంటూ చెప్పి మూడు కోట్ల వరకు వసూలు చేసి చివరికి వాటితో పరారయ్యారు తల్లి కూతుర్లు.. ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..