ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులు ఇప్పుడు ప్రజల పై అధికారాన్ని చూపిస్తున్నారు. కొంత మంది చేస్తున్న పనుల వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చ ఏర్పడింది.. కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వం కూడా పోలీసులను కంట్రోల్ చేయలేక పోతుంది. న్యాయం కోసం పోలీసు స్టేషన్ కు వస్తున్న వారిని అమానుషంగా కోడుతున్నారు. మహిళలు అని కొద్దిగా కూడా లేకుండా అతి దారుణంగా కట్టేసి కొట్టిన ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. న్యాయం కోసం వచ్చిన మహిళలను అతి దారుణంగా తాళ్లతో కట్టేసి అతి దారుణంగా కొట్టారు పోలీసులు..
వివరాల్లొకి వెళితే..బీహార్ రాష్ట్రంలో ని లోని గయా జిల్లా లో దారుణం జరిగింది. అహత్పూర్ గ్రమంలోని మొర్హార్ నది ఒడ్డున ఇసుక తవ్వకంపై పోలీసుల కు, అక్కడ నివషించె ప్రజలకు మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. అది కాస్త సీరియస్ అవ్వడం తో పోలీసులకు గ్రామస్థుల కు మధ్య భారీ ఘర్షణ జరిగింది.గనుల వేలంలో ప్రభుత్వ అధికారులకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ పోలీసు అధికారులతో ఘర్షణ పడిన గ్రామస్తులపై పోలీసులు అమానుషంగా ప్రవర్థించారు.
ఈ క్రమంలో మహిళలు అనే సంగతి కూడా మార్చిపోయి చేతులు పట్టుకొని కట్టేసి మరి దయ లేకుండా కొట్టారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది.టెండర్లలో హక్కులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు బలగాలతో నదీ తీరానికి చేరుకున్నారు. ఇసుకను వెలికితీయాల్సిన హద్దులు గుర్తిస్తున్నారు. ఆ సమయం లో ఆ గ్రామం లో అందరు అక్కడకు చేరుకున్నారు. టెండర్లలో హక్కులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు బలగాల తో నదీ తీరానికి చేరుకున్నారు. ఇసుకను వెలికితీయాల్సిన హద్దులు గుర్తిస్తున్నారు. అప్పుడు భారీ గొడవ జరగడం తో పోలీసులు అందరి పై లాథి చేసుకున్నారు. అధికారం ఉందని ఇలా చేయడం పై పలువురు విమర్శలు చెస్తున్నారు.