స్కూల్ డైరెక్టర్ కీచక బుద్ది.. యువతి పై అత్యాచారం..
వివరాల్లొకి వెళితే.. ఈ అమానుష ఘటన బిహార్ లో వెలుగు చూసింది. గయా నగరం లో హన్స్‌రాజ్ పబ్లిక్ స్కూల్ నడుపుతున్న మనీష్ రుక్రియార్ అనే వ్యక్తి మాట్రిమోనీ వెబ్సైట్ లో పెళ్లి కోసం రిజిస్టర్ చేసుకున్నాడు. కానీ ఆ ప్రొఫైల్‌లో తను ఒక రాజకీయ నాయకుడని పొందు పరిచాడు. నమ్రత అనే యువతి అతని లైక్ చేసింది. అదే అదునుగా భావించిన అతను ఆమెను తన దగ్గరకు రమ్మని పిలిచాడు. ఆమె అది నిజమని నమ్మింది.
ఒకరోజు మనీష్ ఢీల్లీకి పనిమీద వస్తున్నట్లు నమ్రతతో చెప్పాడు. ఆ రోజు సాయంత్రం నమ్రతను కలిసి ఆమెను తన ఫ్రెండ్ దగ్గరకు పార్టీకోసం తీసుకెళ్లాడు. కానీ అక్కడ ఎవరూ లెకపొవడంతో ఆమెకు డౌట్ వచ్చి అడిగితే ఆమెకు సర్ ప్రైజ్ చెసానని నమ్మించాడు. ఆమెను త్వరలో వివాహం చేసుకుంటానని నమ్మించి.. ఆమెకు ఇష్టం లేకున్నా కూడా శృంగారం చేశాడు.. ఆ తర్వాత ఆమెను ఇంటి దగ్గర వదిలి వెళ్లాడు. తర్వాత అతనికి ఎన్ని సార్లు ఫోన్ చేసిన కూడా అతను లిఫ్ట్ చేయక పోవటంతో మొసపొయానని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించింది..