దారుణం: కుక్కపై లైంగిక దాడి... వ్యక్తి అరెస్ట్?

frame దారుణం: కుక్కపై లైంగిక దాడి... వ్యక్తి అరెస్ట్?

VAMSI
ఈ సమాజం ఎక్కడకి వెళుతోంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే దేశాన్ని బాధ పెడుతోంది రెండే రెండు అంశాలు అని చెప్పవచ్చు ఒకటి డ్రగ్స్, రెండవది మహిళలపై జరుగుతున్న హత్యాచారాలు. రోజుకి ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు దుర్మార్గుల కామానికి బలైపోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాము. ప్రభుత్వాలు ఎన్ని కఠినమైన ఆంక్షలు, చట్టాలు తీసుకు వస్తున్నా వారిలో ఇసుమంతైనా భయం కలగడం లేదు. పైగా రోజు రోజుకి నేరాల శాతం పెరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు తాజాగా అలంటి ఒక లైంగిక ఘటన భాగ్యనగరంలో చోటు చేసుకుంది. కానీ ఆ దరిద్రుడి కామానికి బలై పోయింది ఎవరో తెలిస్తే మీకు కన్నీళ్లు ఆగవు.

హైద్రాబాద్ నల్లకుంట లోని నరసింహ బస్తీలో ఒక సీసీ కేమెరా ద్వారా మూడు రోజుల నుండి జరుగుతున్న ఈ ఘటన వెలుగు లోకి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. ఒక మానవ మృగం ఒక వీధి కుక్కపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆ ఏరియా కార్యకర్త పృథ్వి పోలీసులకు  తెలిపారు. అయన తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 5 వ తేదీన నా మొబైల్ కు ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో చూడగానే నా మనసు తరుక్కుమంది. వీడియోలో ఉన్న వ్యక్తి వీధి కుక్కలను లక్ష్యంగా చేసుకుని తన లైంగిక కోరికలు తీర్చుకుంటున్నాడని తెలిపారు. ఈ విషయం గురించి తెలిసి పోలీసులు మొదట ఆశ్చర్యం వ్యక్తం చేసినా సదరు వ్యక్తిని ఆ వీడియో ద్వారా అరెస్ట్ చేశారు.

అయితే ఇంతకాలం మహిళలను మాత్రమే ఈ దుర్మార్గుల నుండి కాపాడుకోవాల్సి వచ్చింది. కానీ ఈ దుర్ఘటన తర్వాత నోరు లేని మూగ జీవాలను సైతం వీరికి దూరంగా ఉంచాలని జంతు ప్రేమికులు తెలియ చేస్తున్నారు. నిజంగా ఇది చాలా దురదృష్టకరం అని తెలిసినవారు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: