మనిషిని చంపిన కోడి.. అసలేం జరిగిందంటే?

praveen
కోడిపందెం.. ఈ పేరు చెబితే చాలు ఇక తెలుగు ప్రజలందరికీ కూడా పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు అని అడిగితే మీకేం తెలుసు బాసు కోడిపందాల్లో ఎంత మజాగా ఉంటుందో అని సమాధానం చెబుతారు ఎంతోమంది. ఇక ప్రతి సంక్రాంతికి ఏపీలో కోళ్ల పందాలు ఎలా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  అయితే కేవలం సంక్రాంతికి మాత్రమే కాదు కొంతమంది సాధారణ రోజుల్లో కూడా కోళ్ల పందాలు నిర్వహిస్తూ జూదం ఆడటం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటివి నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించినా పోలీసుల కంటపడకుండా ఎక్కడో ఓ చోట సీక్రెట్ గా కోళ్ల పందాలు నిర్వహించడం చేస్తూ ఉంటారు.

 కోళ్ల పందాల లో కోడి కాళ్లకు కట్టే కత్తి ఎంత పదునుగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కత్తితో ఎంతో సులభంగా మనిషి ప్రాణాలను కూడా తీయవచ్చు. ఇక ఇప్పుడు ఇదే జరిగింది. ఏకంగా ఒక కోడి మనిషి ప్రాణాలు పోవడానికి కారణం అయ్యింది. కోడిపందాలు జరుగుతున్నాయి అని సరదాగా చూసేందుకు వెళ్లిన ఒక వ్యక్తి ప్రాణం గాలిలో కలిసిపోయింది. కోడి కి కట్టిన కత్తి తగిలి తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా చివరికి మార్గమధ్యంలోనే ప్రాణం పోయింది. చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం ముదివేడు లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

 గంగులప్పా అనే వ్యక్తి స్థానికంగా జరుగుతున్న కోళ్ల పందాలను చూసేందుకు ఎంతో ఆత్రుతగా వెళ్ళాడు. ఇక కోడి పందెం ఎంతో రసవత్తరంగా సాగుతోంది.   ఏ కోడి గెలుస్తుందా అని ఆతృతతో కాస్త ముందుకు వెళ్ళాడు. ఈ క్రమంలోనే కోడికాలుకు కట్టిన కత్తి గంగులప్పా మణికట్టును కోసేసింది. దీంతో తీవ్రంగా రక్తస్రావమైంది. అక్కడ ఉన్న స్థానికులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు.  కానీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నా సమయంలో ప్రాణం పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘటనస్థానికంగా కలకలం సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: