ఇంటికొచ్చిన భార్య చెల్లి.. చివరికి?

praveen
నేటి రోజుల్లో కామంతో ఊగిపోతున్న మనుషులు బంధాలకు బంధుత్వాలకు అస్సలు విలువ ఇవ్వడం లేదు. ఏకంగా సొంత వాళ్ల విషయంలో కూడా దారుణంగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. కామంతో కళ్లు మూసుకుపోయి అత్యాచారం చేయడానికి పశువుల్లా మీద పడి పోతున్నారు ఎంతోమంది మానవ మృగాలు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా భార్య చెల్లెలు మరదలు అవుతుంది.  ఇక మరదలు ఇంటికి వచ్చినప్పుడు మరదలిని ఆటపట్టించడం సరదాగా మాట్లాడటం చేస్తూ ఉంటారు.


 కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం మరదలు ఇంటికి వచ్చిందో లేదో ఎలాగైనా కామవాంఛ తీర్చుకోవాలి అనుకున్నాడు. ఇక భార్యకు తెలియకుండా మరదలిని లోబరుచుకోవాలి  అని నిర్ణయించుకున్నాడు. అయితే మరదలు మైనర్ అన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు. చివరికి మాయమాటలతో మరదలిని లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి ఈ విషయం బయటపడటంతో ఆ కామాంధుడిని అరెస్టు చేసిన పోలీసులు కటకటాల వెనక్కి తోసారూ. ఈ ఘటన స్థానికంగా అందరినీ ఒక్క సారిగా షాక్ అయ్యేలా చేసింది.

 ఈ ఘటన శివమొగ్గ లో వెలుగు లోకి వచ్చింది. ఈ పాడు సమాజం లో  ఎక్కడో ఉండటం కంటే అక్క బావ దగ్గర ఉంటూ చదువుకుంటే ఏం సమస్య ఉండదు అని భావించింది ఆ బాలిక. ఆ మైనర్ బాలికను కన్నబిడ్డల భావించాల్సిన బావా పాడు బుద్ధితో ఆలోచించాడు. ఎలాగైనా మైనర్ బాలిక పై కోరిక తీర్చుకోవాలి అని అనుకున్నాడు. ఇక మాయ మాటలతో బాలికను లొంగదీసుకుని లైంగిక వాంఛలు తీర్చుకుంటూ వచ్చాడు. ఇటీవల అనారోగ్యానికి గురైన బాలికలను అక్క ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్ళింది. ఈ సమయంలోనే బాలిక ఏకంగా ఏడు నెలల గర్భవతి అన్న విషయం బయటపడింది. చివరికి అసలు విషయం బయటపడడంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: