దేవుడా: లిఫ్ట్ ఇవ్వడంతో చిగురించిన ప్రేమ.. శారీరక బంధం.. చివరకు ట్విస్ట్..!!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలం మక్కినవారిపాలెం గ్రామానికి చెందిన యువతి కుమార్తె టెన్త్ క్లాస్ చదువుతుంది. అయితే రెండేళ్ల క్రితం కూలి పనుల కోసం కొమ్మాలపాడు గ్రామానికి వచ్చారు. ఇక అదే గ్రామానికి చెందిన షేక్ బాజీ అనే యువకుడు స్థానికంగా మెడికల్ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. కాగా.. ఓ రోజు ఆమెతో మాటలకు కలిపిన బాజీ.. బైక్ పై ఆమె స్వగ్రామంలో డ్రాప్ చేయడంతో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.
ఇక అప్పడి నుండి అతడు తరచూ ఫోన్ చేస్తూ ఉండేవాడు. ఈ తరుణంలోనే ఇద్దరూ దగ్గరై పలుసార్లు శారీరకంగా కలవడంతో యువతీ గర్భం అబార్షన్ చేయినట్లు సమాచారం. కాగా.. యువతీ పెళ్లి చేసుకోవాలని బాజీని నిలదీయగా అందుకు ఒప్పుకోలేదు. తీవ్ర మనస్తాపం చెందిన బాధితురాలు ఎలుకల మందు తిని పోలీస్ స్టేషన్ ఎదుట స్పృహ తప్పి పడిపోవటంతో వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు బాధితురాలి నుండి వివరాలు సేకరించి కేసు నమోదు చేసికొని దర్యాప్తు చేపట్టారు.
అలాగే కర్నూలు జిల్లా ఆలూరులో ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడారు. వారి ప్రేమవిషయం ఇంట్లో తెలియడంతో ఆందోళన చెంది బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే వారి మధ్య ఏం జరిగిందో తెలీదు కానీ యువకుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు యువతికి చెప్పడంతో ఆమె అతడి స్నేహితులకు విషయం చెప్పింది. వారు వెళ్లి చూసేసరికి అతడు మృతి చెందాడు. ఇక యువతిని వాళ్ళ బంధువుల ఇంటికి తీసుకెళ్లి ఉంచగా.. ఆమె అర్ధరాత్రి గదిలోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.