అలా చేశాడని.. కొడుకుని చంపేసిన పేరెంట్స్?

praveen
కొడుకు పుట్టగానే వారసుడు పుట్టాడు అంటూ ఎంతో మంది తల్లిదండ్రులు ఆనంద పడిపోతూ ఉంటారు. ఇక ఏ చిన్న కష్టం కూడా రాకుండా చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచుతూ ఉంటారు. ఇక కొంతమంది తల్లిదండ్రులు అతి గారాబం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే తల్లిదండ్రులు చేసే అతి గారాబం  పిల్లలు చెడి పోవడానికి కారణం అవుతుందని  మానసిక నిపుణులు చెప్పే మాట. అతిగారాబం కారణంగా పిల్లలు ఎటు పనికిరాకుండా పోతారు అని అంటూ ఉంటారు. అయితే సాధారణంగా కొడుకు పుట్టినప్పుడు  కాదు ప్రయోజకుడు అయినప్పుడు పుత్రోత్సాహం  ఉంటుంది అని అంటూ ఉంటారు.


 ఇక్కడ తల్లిదండ్రులు అలాగే అనుకున్నారూ. కొడుకు పుట్టాడు అని సంతోష పడిపోయారు. కొడుకు భవిష్యత్తు బాగుండాలని ఎంతో త్యాగం చేశారు. కానీ పెద్దయిన తర్వాత కొడుకు ఆ తల్లిదండ్రులను తరచూ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఒకప్పుడు కొడుకు పుట్టాడని సంతోషం పడిన తల్లిదండ్రుల ఇలాంటి కొడుకును మాకు ఎందుకు ఇచ్చావు దేవుడా అని బాధ పడే పరిస్థితి వచ్చింది. తరచూ మద్యం తాగుతూ తల్లిదండ్రులను దారుణంగా వేధించడం మొదలుపెట్టాడు కొడుకు. కొన్నాళ్ళ వరకూ కొడుకు వేధింపులు భరించిన తల్లిదండ్రులు చివరికి విసిగిపోయారు.


 పేగు బంధాన్ని కూడా మరిచి పోయారు. చివరికి తాగొచ్చి వేధిస్తున్న కొడుకుని దారుణం గా హత్య చేశారు తల్లిదండ్రులు. ఘటన తమిళనాడు లో వెలుగు లోకి వచ్చింది. కరిమెడు ప్రాంతానికి చెందిన మణికందన్ మద్యానికి  బానిస గా మారి తల్లి దండ్రులను వేధించేవాడు. ఈ క్రమం లోనే  వేధింపులు భరించలేక పోయిన పేరెంట్స్ అతడిని హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని సైకిల్పై నది సమీపంలో కి తీసుకెళ్లి దహనం చేశారు. అయితే సగం కాలం మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: