యువతి వేధింపులు.. యువకుడు షాకింగ్ నిర్ణయం?

praveen
ఇటీవలి కాలంలో సైబర్ నేరగాళ్లు బెడదా రోజురోజుకు ఎక్కువైపోతుంది. ఇక సైబర్ నేరగాళ్లు ఏదో ఒక విధంగా అమాయకులను బురిడి కొట్టించి ఖాతాలు ఖాళీ చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇలా నేరాలకు పాల్పడేందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క దారిని ఎంచుకుంటూ ఉండటం గమనార్హం. ఎంతోమంది సైబర్ నేరగాళ్లు అమాయకులను టార్గెట్గా చేసి ఇక కీలక సమాచారాన్ని తెలుసుకొని ఖాతాలను ఖాళీ చేస్తున్నారు.. ఒక మరికొంతమంది మాత్రం కాస్త వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు అయితే తమ అందాలను ఎరగా వేస్తూ ఉండటం గమనార్హం.



 అందాలనే ఆయుధంగా మార్చుకొని ఎంతో మంది అమ్మాయిలకు వల వేస్తున్నారు. తియ్యగా మాట్లాడుతూ దగ్గరవుతున్నారు. ఆ తర్వాత వారి అసలు స్వరూపాన్ని బయటపెట్టి చివరికి డబ్బులు గుంజటం లాంటివి చేస్తున్నారు.ఇలా ఇటీవల కాలంలో ఎంతో మంది యువతులు సోషల్ మీడియా వేదికగా అమాయకులతో పరిచయం పెంచుకోవడం ఇక ఆ తర్వాత తియ్యగా మాట్లాడటం చివరికి నగ్నంగా వీడియో కాల్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఇక ఇలా వీడియో కాల్ చేసిన తర్వాత పూర్తిగా వీడియో ని రికార్డ్ చేసి దానిని సోషల్ మీడియాలో పెడతాను అంటూ ఎంతో మంది బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అనే విషయం తెలిసిందే.



 ఇక్కడ ఓ యువకుడికి ఇలాంటి వేధింపులు ఎదురయ్యాయి. దీంతో ఎంతగానో మనస్తాపం చెందిన యువకుడు చివరికి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగళూరులో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.. ఇంస్టాగ్రామ్  వేదికగా ఓ యువతి రోహిత్ అనే యువకుడితో పరిచయం అయ్యింది. ఎంతో చనువు  కూడా పెంచుకుంది. దీంతో ఇక ఇద్దరు నగ్నంగా వీడియో కాల్ కూడా చేసుకున్నారు. ఇక ఇదంతా సీక్రెట్ గా రికార్డు చేసింది ఆ యువతి. తర్వాత ఆ యువకుడికి నగ్నంగా ఉన్న వీడియో పంపించి డబ్బులు పంపించకపోతే సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను అంటూ చెప్పింది. దీంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: