దేవుడా: పదేళ్ల ప్రేమకు ఇదేం ముగింపు.. ఊహించని ట్విస్ట్.. అసలు ఏమైందంటే..??

N.ANJI
వారిద్దరూ పదేళ్ల నుంచి ఒక్కరిని ఒక్కరు ప్రేమించుకున్నారు. ఇక యువతీ అతడే తన సర్వస్వం అనుకుంది. అంతేకాదు.. ఇంట్లో పెద్దవాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ ఇంతలో యువకుడు ఆమెకి ఊహించని ట్విస్ట్ ఇచ్చి ఆశ్చర్యానికి గురి చేశాడు. అతడు ఆమెతో ఇన్నాళ్లు శారీరకంగా కలిసి తీరా మోజు తీరిపోవడంతో ఇంట్లో పెద్దలు తీసుకొచ్చిన పెళ్లి సంబంధానికి ఓకే చెప్పి నిశ్చితార్థం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోలార్ తాలూకా అరభికొత్తనూర్‌ గ్రామానికి చెందిన అంబికా, మహేష్ గత పదేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే అంబికా అతనిని పూర్తిగా నమ్మడంతో ఇద్దరి మధ్య శారీరకంగా కూడా కలుసుకున్నారు. ఇక అతడు  పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆ శారీరక సంబంధం ఇన్నేళ్లుగా కొనసాగించింది. అలాగే అంబికా కూడా అతనిని పూర్తిగా నమ్మడంతో అడ్డు చెప్పలేకపోయింది. చివరికి మహేష్, అంబికాకి ఊహించని ట్విస్ట్ ఇచ్చి ఆమెని షాక్ కి గురి చేశాడు.
ఇక అతడు ఇంట్లో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని అంబికాకు మాటిచ్చి.. పెద్దలు కుదిర్చిన సంబంధం తాలూకా అమ్మాయితో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఇక ఈ విషయం తెలిసిన అంబికా మహేష్‌ను నిలదీసింది. అంతేకాదు.. ఆమె మహేష్‌పై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి కేసు పెట్టించింది. అయితే బెయిల్‌పై బయటకు వచ్చిన మహేష్ చివరికి అంబికాను వివాహం చేసుకున్నాడు. ఇక మహేష్ పేళ్లి చేసుకున్న రోజు నుంచి అదృశ్యమైయ్యాడు. అతడు ఎక్కడికి వెళ్లాడో తెలీదు.. ఇక మహేష్ ఫోన్‌లో అందుబాటులో కూడా లేడు.
దీంతో మహేష్ ఇంటి ముందు అంబిక న్యాయపోరాటం చేపట్టారు. ఇక మహేష్ కేసు నుంచి బయటపడేందుకే అంబికను పెళ్లి చేసుకున్నాడని ఆమె తండ్రి ఆరోపణలు చేశాడు. ఇక మహేష్, అతని కుటుంబం కలిసి తన కూతురికి అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆరోపించాడు. ఇక ఎలాగైనా పోలీసులే న్యాయం చేయాలని ఆమె తండ్రి వేడుకున్నాడు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: