బిడ్డ చనుబాలు తాగడం లేదని.. తల్లి ఏం చేసిందో తెలుసా?

praveen
నేటి రోజుల్లో మనుషుల ఆలోచన తీరు ఎటుపోతుందో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది పరిస్థితి. చిన్నచిన్న కారణాలకే మనస్థాపం చెందుతూ అక్కడితో జీవితం అయిపోయింది అని భావిస్తున్నారు ఎంతోమంది. గట్టిగా తలుచుకుంటే తీరిపోయే సమస్యలకే ఇక నేను బ్రతకలేను అంటూ షాకింగ్ నిర్ణయం తీసుకుంటున్నారు. అనాగరిక సమాజంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొన్న మనుషులు ఇక ఇప్పుడు నాగరిక సమాజంలో కి అడుగు పెడుతూ.. సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని కోల్పోతున్నారు అన్నది అర్ధమవుతుంది.

 చాక్లెట్ తిన్నంత సులభంగా చిన్నచిన్న కారణాలకే మనస్థాపం చెందుతూ బలవంతంగా ప్రాణాలను తీసుకుంటున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. టీచర్ తిట్టిందని లేదా తల్లిదండ్రులు మందలించారని .. ప్రేయసి మాట్లాడటం లేదని ఇక ఇంతటితో జీవితం ముగిసిపోయింది అంటూ ఎంతో మంది మనస్తాపం చెందుతున్నారు. ఈ లోకంలో బ్రతకలేము అంటూ కఠిన నిర్ణయాలు తీసుకుంటూ చివరికి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇక ఇప్పుడు ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. నవమాసాలు మోసి ఓ బిడ్డకు జన్మనిచ్చింది తల్లి. బిడ్డ పుట్టిందని ఎంతగానో సంతోష పడిపోయింది.

 కానీ ఇక తొమ్మిది నెలల కూతురు పాలు తాగడం మానేసింది. అయితే ఎందుకు ఇలా జరుగుతుంది అనే వైద్యుడిని సంప్రదించకుండా సదరు మహిళ మనస్థాపంతో కఠిన నిర్ణయం తీసుకుంది.  చనుబాలు తాగడం లేదు అంటూ చివరికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఈ ఘటన కర్ణాటకలోని మైసూర్లో వెలుగులోకి వచ్చింది. చనిపోయిన సదరు మహిళను అర్పిత గా పోలీసులు గుర్తించారు. అర్పితకు పెళ్లయిన నాలుగేళ్లకు ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే గత 15 రోజుల నుంచి ఆ చిన్నారి చనుబాలు తాగడం లేదు. దీంతో అర్పితా ఎంతగానో మనస్తాపానికి గురైంది. ఇక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: