అతడికి 50..ఆమెకు 19 కలిశారు.. ఇంతలో ఆమె గర్భం..!

MOHAN BABU
 సమాజంలో టెక్నాలజీ పెరిగింది. ఈ టెక్నాలజీతో పాటు మనుషులు కూడా ఎంతో ముందుకు పోతున్నారు. అలాంటి సమయంలో మహిళలు పురుషులు సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇంత జరుగుతున్నా  మహిళలపై మాత్రం వేధింపులు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలు మృగాళ్ల చేతిలో బలవుతూనే ఉన్నారు. అలాంటి ఒక సంఘటన ఏపీలో చోటు చేసుకుంది. మాయమాటలు చెప్పాడు. ఉద్యోగం ఇప్పిస్తానని, నీ బాధ్యత తనదేనని మెల్లమెల్లగా నమ్మించి ముగ్గులోకి దింపాడు. చివరికి ఆమె గర్భం దాల్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందామా..?


 ప్రకాశం జిల్లా సూళ్లూరుపేట లో గోపాల్ (50) అనే వ్యక్తి శ్రీహరికోట శబరి కాలనీకి చెందినటువంటి 19 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. ఆమె ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పి తెలిసిన చోట ఏదైనా ఉద్యోగం ఇప్పించమని గోపాల్ ను అడిగింది. దీన్ని ఆసరాగా తీసుకున్నటువంటి గోపాల్ శ్రీహరికోటలో స్విఫర్ ఉద్యోగం అంటూ నమ్మించాడు. అలా ఒకరోజు ఉద్యోగం గురించి మాట్లాడాలని చెప్పి ఆమెను పిలిపించాడు. నీకు ఉద్యోగం వచ్చిందని, నువ్వు అందులో జాయిన్ కావాలంటే నేను చెప్పినట్లు చేయాలని యువతిని లొంగదీసుకున్నాడు. కాని దానికి ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. మీ ఇంటి సమస్యలు తీరాలంటే నీకు ఉద్యోగం కంపల్సరిగా కావాలి.

 కాబట్టి నేను చెప్పినట్టు చేస్తేనే ఇస్తాను అని ఆమె అవసరాన్ని ఆసరాగా తీసుకొని చివరికి తన  కోరిక తీర్చుకున్నాడు. ఇలా  తనకు కావలసినప్పుడల్లా ఆ యువతితో గడిపి రాక్షసానందం పొందాడు. చివరికి ఆ అమ్మాయి గర్భం దాల్చింది. వెంటనే గోపాల్ తన బంధువుల ఇంటికి తీసుకువెళ్లి అబార్షన్ కూడా చేయించారు. ఈ విషయం కాస్త బాధితురాలి తల్లిదండ్రుల తెలుసుకోవడంతో, వారు ఆ బాధితురాలితో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: