మరో మహిళతో భర్త ఎఫైర్.. భార్య ఏం చేసిందంటే?
మహబూబ్నగర్ లో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టించింది. మండల పరిధిలోని చంద్రవంచ గ్రామానికి చెందిన తాయప్ప, గోపమ్మ భార్య భర్తలు నివసిస్తున్నారు.. అయితే కొన్ని వేల వరకు ఎంతో సాఫీగా సాగిపోతున్న సంసారంలో కలహాలు మొదలయ్యాయి. భార్య భర్తలు ఇద్దరు ఏదో ఒక విషయంలో తరచూ గొడవ పడుతూ ఉండేవారు. ఇదే సమయంలో భార్య దగ్గర సుఖం దొరకడం లేదు అని భావించిన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధానికి తెరలేపాడు. కట్టుకున్న భార్యను పట్టించుకోవడం మానేశాడు తాపయ్య.
ఏదో చుట్టాలింటికి వచ్చినట్లుగా అప్పుడప్పుడు కట్టుకున్న భార్య దగ్గరికి వస్తూ ఉండేవాడు. అయితే భార్య గోపమ్మ పిల్లలను చూసుకుంటూ అత్తమామల వద్ద ఉంటుంది.. అయితే భర్త తనను పట్టించుకోవడం లేదని ఇక పిల్లలను పోషించడం ఇబ్బందిగా మారుతుంది అని మనస్తాపం చెందింది గోపమ్మ. ఈ నెల 27వ తేదీన ఇంట్లో పురుగుల మందు తాగిన విషయాన్ని అత్తమామలు గోపమ్మ తల్లి గారి కుటుంబానికి ఫోన్లో సమాచారం అందించడంతో ఇక వెంటనే వారు వచ్చి ఆసుపత్రికి తరలించినా అప్పటికే చనిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు భర్త కుటుంబసభ్యులను బలవంతంగా పురుగుల మందు తాగించి హత్య చేశారని మృతురాలి సోదరుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.