మద్యం తాగొద్దంటే.. పురుగుల మందు తాగాడు.. చివరికి?
ఇక లాక్డౌన్ సమయంలో మద్యం దొరక్కపోవడంతో మందుబాబులు అందరూ కూడా పిచ్చెక్కి పోయారు. దీంతో ఆల్కహాల్ ఎక్కడ దొరుకుతుందా అని వెతకడం ప్రారంభించారు కొన్ని కొన్ని సార్లు ఏకంగా శానిటైజర్ తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇక ఇప్పుడు ఇలాంటిదే జరిగింది అని చెప్పాలి. మద్యం తాగొద్దు అని భార్య చెప్పినందుకు ఏకంగా పురుగుల మందు తాగాడు భర్త. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది. సిద్దిపేట జిల్లా రాయపోల్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
రాయపోల్ మండల పరిధిలోని మద్దూరు గ్రామంలో అంబాల స్వామి, రేణుక దంపతులు నివసిస్తున్నారు. ఇక ఇటీవలే పండించిన ధాన్యాన్ని ఐకెపి కేంద్రంలో విక్రయించాడు. ఈ క్రమంలోనే వచ్చిన సొమ్ముతో గత వారం రోజుల ఫుల్లుగా మద్యం సేవిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే మద్యం తాగవద్దు అంటూ భార్య సూచించింది. దీంతో ఇక మద్యం తాగొద్దు అన్నందుకు చివరికి పురుగుల మందు తాగాడు స్వామి. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్వామి మృతితో కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది.