నేనేం తప్పు చేశా.. పుట్టకముందే చావా?
నాగరిక సమాజంలో కూడా ఇలాంటి తరహా ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి.. ముక్కుపచ్చలారని పసికందులను ఎంతో మందిని దారుణంగా చెత్తకుప్పల్లో పడేస్తున్నారు. కొంతమంది అభం శుభం తెలియని శిశువుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఇటీవల రోడ్డు పక్కన ముళ్ళ పొదల్లో ఒక నవజాత శిశువు మృతదేహం లభ్యం కావడం సంచలనం గా మారిపోయింది. ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.
ఖమ్మం జిల్లాలోని పెద్దమండవ లో ఈ దారుణం వెలుగుచూసింది. సి సి రోడ్డు పక్కనే నవజాత శిశువు మృతదేహం ఉండటాన్ని స్థానికులు గమనించారు.. ఈ క్రమంలోనే పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. అయితే నెలలు నిండకముందే గర్భం నుంచి శిశువును తొలగించి ఉంటారని స్థానికులు భావించారు. ఈ క్రమంలోనే ఇక ఆ శిశువు మృతదేహాన్ని గ్రామస్తులు కననం చేయడం గమనార్హం.. ఈ ఘటన కాస్త అందరి మనసును కదిలించింది. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎంతో మంది ఇలా ఏ తప్పూ చేయని శిశువుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు అంటూ ఎంతో మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.