డాక్టర్ దగ్గరికి నిండు గర్భిణీ.. కానీ ఇలా చేశాడేంటి?

praveen
వైద్యులు కలియుగంలో కనిపించే ప్రత్యక్ష దైవం అని చెబుతూ ఉంటారు. కరోనా వైరస్ కాలంలో ఇది నిజమే అని నిరూపించారు ఎంతో మంది వైద్యులు. ఒకవైపు ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడటం లో నిమగ్నమయ్యారు డాక్టర్లు. కరోనా వైరస్ పోరాటంలో ఎంతో మంది వైద్యులు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. ఇలా ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టి కరోనా వైరస్ సమయంలో ప్రత్యక్ష దైవాలుగా మారిపోయారు వైద్యులు. కానీ ప్రస్తుతం కొంతమంది వైద్యులు మాత్రం నిర్లక్ష్యంగా ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ప్రాణాలు కాపాడాలని వైద్యుల దగ్గరికి వస్తే చివరికి నిర్లక్ష్యంతో ప్రాణాలు తీసేస్తున్నారు.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రైవేటు వైద్యులు నిర్లక్ష్యం వల్ల అప్పుడే పుట్టిన నవజాత శిశువు ఈ లోకాన్ని కూడా చూడకుండానే కన్నుమూసింది. దీంతో ఇక తమకు బిడ్డ పుట్టింది అని ఆనందం ఆ తల్లిదండ్రులకు నిమిషాలపాటు కూడా లేకుండా పోయింది  ఇక వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని భావించి తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం ఆస్పత్రి ముందు ఆందోళన నిర్వహించారు. అంతే కాదు ఆసుపత్రి అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది.


 మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గౌరారం శివారులో ఉన్న కోడిపుంజుల తండాలో నిండు గర్భిణీ పురిటి నొప్పులు రావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలోనే చికిత్స అందించగా గర్భిణి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఇక ఆ తర్వాత ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం ఖమ్మం లోని ఓ పెద్ద ఆస్పత్రికి తరలించారు. చివరికి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణీకి జన్మించిన నవజాత శిశువు మృతి చెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరిగింది అని ఆరోపించారు. ఇక మహబూబాబాద్ లో ఉన్న ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టడమే కాదు ఆగ్రహంతో ఆసుపత్రి అద్దాలను కూడా ధ్వంసం చేశారు. ఇక ప్రస్తుతం తల్లీ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని  పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: