దారుణం : మతిస్థిమితం లేని బాలిక.. వివస్త్రగా ఉండడంతో?
మహిళల రక్షణకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా ఆ చట్టాలు మహిళలకు రక్షణ కల్పించ లేకపోతున్నాయి అన్నది ప్రస్తుతం అందరికీ తెలిసిన నిజం. ఇక్కడ ఒక దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మతిస్థిమితంలేని బాలికపై విషయంలో జాలి చూపించాల్సింది పోయి కామంతో ఊగిపోయాడు. అభం శుభం తెలియని బాలికపై చివరికి లైంగిక దాడికి పాల్పడ్డాడు.. ఒడిశాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రాయగడ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న నమత గ్రామంలో భగీరథి నచక అనే మహిళ 13 ఏళ్ళ దివ్యాంగ బాలికను ఇంటి దగ్గర వుంచి కట్టెల కోసం అడవికి వెళ్ళాడు. ఈ క్రమంలోనే అదే ప్రాంతంలో ఉండే కొంత మంది కామాంధులు ఇంట్లో ఎవరూ లేరన్న విషయాన్ని గ్రహించి మతిస్థిమితంలేని బాలికపై లైంగికదాడికి పాల్పడ్డారు
అయితే ఈ దాడిలో బాలిక స్పృహ కోల్పోయింది. ఇక సాయంత్రం అడవి నుంచి తిరిగి వచ్చిన తల్లిదండ్రులు కూతురు వివస్త్రగా ఉండటం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. మతిస్థిమితం లేదు కదా తెలియకుండానే బట్టలు ఊడిపోయి ఉంటాయని అనుకున్నారు. కానీ బాలిక తీవ్ర అస్వస్థతకు గురికావడంతో దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించగా చివరికి పరీక్షించిన వైద్యులు బాలికపై అత్యాచారం జరిగిందని ధ్రువీకరించారు. దీంతో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించి ఘటనపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.