కాలువలో తేలిన శవాలు.. వెళ్లి చూసి పోలీసులు షాక్?

praveen
ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎంతో మంది అనుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కోసం ఎంతగానో కష్టపడి పోతున్నారు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తే అంతకంటే అదృష్టం ఇంకేమీ ఉండదు అని అనుకుంటున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి అనుకున్నట్టుగానే ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. కుటుంబంతో కలిసి ఎంతో హాయిగా ఉంటున్నాడు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ మనస్థాపంతో చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక వ్యక్తి మాత్రమే కాదు కుటుంబం మొత్తం కాలువలో దూకి ఆత్మహత్య చేసుకోవడం సంచలనం గా మారిపోయింది.



 కర్ణాటక రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది ఈ విషాదకర ఘటన. కర్ణాటకకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆయన భార్య, కూతురు కూడా కాలువలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. అయితే ఇక కాలువలో మూడు మృతదేహాలు తేలుతూ ఉండడం చూసి ఒక్కసారిగా షాకయ్యారు పోలీసులు. ఈ క్రమంలోనే ఇక పోలీసులు అక్కడికి వెళ్లి చూసి అక్కడ ఉన్నది ఒక ప్రభుత్వ అధికారి అని తెలిసి మరింత అవాక్కయ్యారు. కర్ణాటకలోని తుముకూరు జిల్లా చేలూరులో ఉన్న హేమవతి కాలువలో ముగ్గురు దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.  మృతదేహాలు నీటిపై తేలుతూ ఉండగా అటువైపుగా వెళ్తున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.



 ఇక వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే కాలువలో మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలు ఉబ్బి పోవడంతో ఇక ఎవరు అన్నది గుర్తించలేకపోయారు పోలీసులు. ఈ క్రమంలోనే ఆరా తీయగా మృతుడు కేబీ క్రాస్ హేమవతి కాలువ కార్యాలయంలో పనిచేస్తున్న అసిస్టెంట్ ఇంజనీర్ రమేష్ గా గుర్తించారు. ఇక మిగతా ఇద్దరు ఆయన భార్య మమత కూతురు శుభాగా గుర్తించారు. ఈ క్రమంలోనే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: