భర్తలకు షాక్ ఇచ్చిన హైకోర్టు.. అలా చేసినా నేరమేనట?

praveen
ఇటీవలి కాలంలో ఎంతో మంది భర్తలు భార్యలపై అనుమానం పెంచుకోవటం లాంటివి చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఎన్నో రకాలుగా వేధింపులకు కూడా పాల్పడుతున్నారు. అయితే  ఇక భార్యకు తెలియకుండా ఏకంగా సెల్ ఫోన్ లో సంభాషణలు రికార్డింగ్ చేయడం లాంటివి కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే పంజాబ్లోని బటిండా కు చెందిన ఒక వ్యక్తి భార్య వేధింపులకు గురి చేస్తుందని. తనకు విడాకులు ఇప్పించాలంటూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు..


 ఇక దీనికి సాక్ష్యంగా ఏకంగా భార్య సెల్ ఫోన్ సంభాషణల రికార్డింగ్ ను కూడా కోర్టులో సమర్పించారు. ఇక ఇలా చేసిన రికార్డింగ్ లే చివరికి అతనికి షాక్ ఇచ్చాయి. దీంతో కేసు మరో మలుపు తిరిగింది. భార్య అనుమతి లేకుండా ఫోన్ కాల్ సంభాషణలు రికార్డింగ్ చేయడం పై పంజాబ్ హర్యానా హైకోర్టులో భార్య కేసు పెట్టడంతో ఇక అతని కి ఊహించని షాక్ తగిలింది. ఇక ఈ కేసు పై తీవ్రంగా స్పందించింది పంజాబ్ హర్యానా హైకోర్టు భార్యకు తెలియకుండా రహస్యంగా  సెల్ ఫోన్ కాల్ రికార్డింగ్ చేయడం అంటే గోప్యత హక్కును ఉల్లంఘించడమే అంటూ స్పష్టం చేసింది.


 2007లో ఫిబ్రవరి 20వ తేదీన ఈ దంపతులు ఇద్దరికీ వివాహం జరుగగా.. 2011లో వీరికి ఒక కుమార్తె జన్మించింది.. ఆ తరువాత మనస్పర్థల కారణంగా తరచూ గొడవ పడుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే 2017లో విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించాడు భర్త. ఇక ఫోన్ రికార్డులను సిమ్ కార్డులను సాక్ష్యాలుగా సమర్పించాడు.. ఇక దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది భార్య. భార్యకు తెలియకుండా ఫోన్ కాల్స్ రికార్డింగ్ చేయడం గోప్యత హక్కులను ఉల్లంఘించడమే అంటూ భార్య తరఫు న్యాయవాది వాధించడంతో.. కేవలం సాక్ష్యాలుగా సమర్పించాలనే ఉద్దేశంతోనే ఇలా చేసానని.. గోప్యతకు భంగం కలిగించాలని కాదు అంటూ భర్త సమాధానమిచ్చాడు. ఇక ఇరువురి వాదనలు విన్న పంజాబ్ హర్యానా హైకోర్టు భార్య అనుమతి లేకుండా ఫోన్ కాల్స్ రికార్డ్ చేయడం నేరం అంటూ వెల్లడించింది. ఇక ఈ రికార్డింగ్ సాక్ష్యంగా పరిగణిస్తూ విడాకులు ఇస్తే ఆరు నెలల్లో  నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: