బాబోయ్ అంత బంగారం అక్కడెలా పెట్టారో మరి...!
బంగారం భారత్‌లోకి ఏ రూపంలో చేరుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. గోల్డ్ స్మగ్లింగ్ కోసం విద్యార్థులు, మహిళలను కూడా వాడేస్తున్నారు. షూ సాక్స్‌లు, మిక్సీల్లో, మహిళల లో దుస్తుల్లో కూడా రవాణా చేశారు. గతంలో ఓ మహిళ అయితే తన అండర్ వేర్లో ఏకంగా కోటి రూపాయల విలువ చేసే బంగారాన్ని పేస్ట్ రూపంలో మార్చేసి తీసుకువచ్చారు. అయితే అనుమానంతో ఆమెను లక్నో ఎయిర్ పోర్టులో పరిశీలించిన కస్టమ్స్ అధికారులు.... బంగారం స్వాధీనం చేసుకుని అరెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు తాజాగా.. మరో ఘటన కస్టమ్స్ అధికారులనే ఆశ్చర్యానికి గురి చేసింది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో నలుగురిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు... వారి నుంచి 7.3 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు సుడానే దేశీయుల నుంచి తమ మల ద్వారంలో ద్రవ రూపంలో దాచిన బంగారాన్ని అధికారులు గుర్తించారు. దుబాయ్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన వీరి కదలికపై అనుమానంతో వారిని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. బంగారం కరిగించి ముద్దను మల ద్వారం ద్వారా తీసుకువచ్చినట్లు గుర్తించారు.