షాకింగ్ : ఒకే స్కూల్లో.. 15 మంది టీచర్లపై గ్యాంగ్ రేప్ ఆరోపణలు?
పాఠశాల ప్రిన్సిపాల్ తో పాటు 15 మంది టీచర్లపై కూడా గ్యాంగ్ రేప్ ఆరోపణలు చేశారు విద్యార్థులు.. ఈ 15 మందిలో ఐదుగురు మహిళా ఉపాధ్యాయురాల్లు కూడా ఉండటం గమనార్హం. ఇలా మహిళా ఉపాధ్యాయుల సహాయంతోనే టీచర్లు తమ పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు అంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు వీడియోలు కూడా తీశారని ఆరోపణలు చేశారు. అయితే అదే పాఠశాలకు చెందిన మాజీ ప్రధానోపాధ్యాయుడు ముగ్గురు విద్యార్థులపై లైంగిక దాడి జరిపిన ఆరోపణలు రావడంతో గత ఏడాది పోలీసులు అరెస్టు చేశారు.
ఈ కేసులో అతను సస్పెండ్ కాగా ఇక అతనికి వ్యతిరేకంగానే మిగితా సిబ్బంది వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం.. ఇక బెయిల్పై విడుదలయ్యాడు సదరు ఉపాధ్యాయుడు. అయితే ఇటీవలే ఇక పాఠశాలలోని 15 మంది టీచర్లపై విద్యార్థులు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసిన సమయంలో సస్పెండ్ అయిన ఉపాధ్యాయుడు పోలీస్ స్టేషన్ బయట వేచి ఉండడం గమనార్హం. ఇక ఈ క్రమంలోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరపగా అసలు విషయం బయటపడింది. ఇటీవలే లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన ఉపాధ్యాయుడు ఐదుగురు విద్యార్థుల కుటుంబాలను ప్రేరేపించిన ట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. కక్షపూరితంగా అనే ఉపాధ్యాయుడు ఇలా చేశాడనిఇక ఈ కేసును మరింత లోతుగా విచారిస్తున్నాము అంటూ పోలీసులు తెలిపారు.