భర్త భార్యను కొడితే తప్పేంటి.. మా ఆయన బంగారం..!

MOHAN BABU
భర్త భార్యను కొడితే తప్పు లేదా..? కోపం వచ్చినప్పుడు కొడితే భరించాల్సిందేనా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇవి ఏ రాజకీయ నాయకుడో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కావు. స్వయంగా కొంతమంది మహిళలే తమ భర్తలు కొట్టడం తప్పుకాదంటున్నారు. 14 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు లోని 30 శాతం మంది మహిళలు భార్యలను కొట్టే భర్తలను వెనకేసుకు వచ్చారు. భార్యలను భర్తలు కొట్టడం సమర్థనీయమేనా అన్న ప్రశ్నకు సమర్థనీయమే అని జవాబు ఇచ్చారు. ఇటీవల విడుదల చేసిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. భార్యను భర్త కొట్టడానికి గల కారణాలను కూడా సర్వే వెల్లడించింది. ఇంటిని, పిల్లలను నిర్లక్ష్యం చేసినప్పుడు, అత్తింటి వారిని గౌరవించనప్పుడు భర్త కొట్టడం సమంజసమేనని అత్యధిక మంది మహిళలు అభిప్రాయపడ్డారు.

ఎక్కువ మంది మహిళలు ఏడు కారణాలను చెప్పారు. భర్తకు చెప్పకుండా బయటికి వెళ్లడం, పిల్లలను,ఇంటినే పట్టించుకోకపోవడం, భర్తతో వాదించడం, సెక్స్ కి ఒప్పుకోకపోవడం, వంట సరిగ్గా చేయకపోవడం, భార్య ప్రవర్తన సరిగా లేదని  అనుమానించడం, భర్త తరపు బంధువులను సరిగ్గా చూసుకోకపోవడం, పిల్లలను ఇంటికి పట్టించుకోకపోవడం  తో భర్తలు కొట్టాలని ఎక్కువ మంది మహిళలు చెప్పారు. భార్యను భర్త కొట్టడం సబబేనని తెలంగాణలో  అత్యధికంగా 83.8 శాతం మంది మహిళలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 83.6 శాతం, కర్ణాటకలో 76.9 శాతం, హిమాచల్ ప్రదేశ్ లో 14.8 శాతం, నాగాలాండ్ లో 23.9 శాతం, త్రిపురలో 29.5 శాతం మంది కరెక్టేనని  తెలిపారు. మగవాళ్ళ విషయానికి వస్తే తెలంగాణలో 70.4 శాతం మంది, ఆంధ్రప్రదేశ్లో 66.5,  కర్ణాటకలో 81.9,  హిమాచల్ ప్రదేశ్ లో 14.2, నాగాలాండ్ లో 34.4, త్రిపురలో 21.3 శాతం మంది భార్యలను భర్తలు కొట్టడం కరెక్టే అన్నారు. అయితే కొంతమంది పురుషులు మాత్రం భార్యలను కొట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: