కోడలిపై మామ కన్ను.. ఇంట్లో నుంచి బయటకు పంపేందుకే... అలా..!

MOHAN BABU
 భర్తను కోల్పోయిన  తన కోడలి ఇంట్లో నుంచి బయటకు వెళ్లగొట్టేందుకు మామ ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు... కోడలితో పాటుగా  తన మనవరాలిని కూడా ఇంట్లోంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశాడు.. దీనికోసం ఆయన ఏం చేసాడో తెలిస్తే మీరే కోపోద్రిక్తులై తారు. భర్తను కోల్పోయిన భార్య తన అత్తగారి ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు ఒక కూతురు కూడా ఉంది. తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తోంది. తన కొడుకే చనిపోయిన తర్వాత కూడా ఇంట్లో ఎందుకు అనుకున్నాడు మామ. వారిద్దరి బాగోగులు చూడాల్సిన ఆయన వారిని బయటకు పంపేందుకు  దారుణానికి ఒడిగట్టాడు. పూర్తి వివరాల్లోకి వెళితే  రాజస్థాన్ కు చెందిన టువంటి  షాలినికి వివాహమై ఒక కూతురు పుట్టిన తర్వాత భర్త మరణించాడు. దీంతో ఆమె ఒక ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అప్పటికే కూతురు పెద్దది కావడంతో ఆమెతో కలిసి ఉంటోంది. కానీ షాలిని మామకు మాత్రం కొడుకు చనిపోయాడు కోడలు ఆమె పిల్లలు ఇంట్లో ఉండకూడదు అని హుకుం జారీ చేశాడు.


 ఎన్నో వేధింపుల కూడా గురిచేశాడు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన వాళ్లు బయటకు వెళ్లకపోవడంతో ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో ఉండే బాత్రూంలో సీక్రెట్ గా కెమెరా అమార్చాడు. కోడలు మరియు మనవరాలు స్నానం చేసే నగ్న  వీడియోలు రికార్డు చేసాడు. తర్వాత ఈ విషయాన్ని వారి కోడలుకు చెప్పడంతో ఆమె షాక్ అయిపోయింది. వెంటనే ఇంట్లో నుంచి బయటకు వెళ్లకపోతే వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరింపులు మొదలుపెట్టాడు. దీంతో భయంతో ఉన్న శాలిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలో తానే కుమిలిపోతుంది. ఇలా కొద్ది రోజులు  చూసింది వేధింపులు ఎక్కువయ్యాయి. ఇక ఓపిక పట్ట లేక చివరకు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు మామను కూడా పిలిచి తమదైన శైలిలో విచారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: