తల్లి బతికుండగానే పెద్దకర్మ.. చివరికి?

praveen
నవమాసాలు మోసి పెంచి జన్మనిచ్చిన తల్లి ప్రేమ ఎంతో గొప్పది అని చెబుతూ ఉంటారు. పేగు తెంచుకొని పుట్టికొడుకుని తల్లి ఎంతో కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది.. ఏ  కష్టం రాకుండా చూసుకుంటుంది. అల్లారుముద్దుగా గోరుముద్దలు తినిపిస్తూ పెద్ద అయ్యేంతవరకు ఆలనా పాలనా చూసుకుంటుంది. అయితే ఒక తల్లికి కొడుకు ఎంత పెద్ద వాడు అయినప్పటికీ ఇంకా పసివాడి లాగా కనిపిస్తూ ఉంటాడు అన్నది అక్షరసత్యం. ఇలా ఎప్పుడు అమితమైన ప్రేమను చూపించే తల్లి పట్ల ఇటీవలి కాలంలో ఎంతోమంది పిల్లలు ప్రేమ కాదు కనీసం జాలి దయ అనేది కూడా చూపించడం లేదు. ఏకంగా కని పెంచిన తల్లి ని ఒక మనిషిగా కూడా చూడకుండా దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.


 ఇటీవలి కాలంలో ఏకంగా నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లిని పెద్దయిన తర్వాత దారుణంగా హతమార్చిన ఘటనలు సభ్యసమాజాన్ని సిగ్గు పడేలా చేస్తున్నాయి. చిన్నచిన్న కారణాలకే ఏకంగా కన్నతల్లి ప్రాణాలు తీస్తున్నారు ఎంతో మంది. ఇక్కడ ఓ వ్యక్తి కూడా ఇలాంటిదే చేసాడు. అయితే.. ఏకంగా జన్మనిచ్చిన తల్లి బ్రతికుండగానే ఆ తల్లి ని చంపేశాడు ఇక్కడ కొడుకు.  తల్లి బతికుండగానే పెద్దకర్మ చేసి అందరికీ షాకిచ్చాడు. ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారిపోయింది. తెలంగాణలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.



 నకిరేకల్ కు చెందిన పోచమ్మకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఇక ప్రస్తుతం అందరి వివాహాలు అయిపోయాయి. కాగా ప్రస్తుతం పోచమ్మ ఆమె రెండో కొడుకు దగ్గర ఉంటుంది. అయితే ఇటీవలే పోచమ్మ పెద్దకొడుకు నీచంగా ఆలోచించాడు. ఏకంగా బతికున్న తల్లినే చంపేశాడు. అంతేకాదు పెద్దకర్మ నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 19వ తేదీన మా తల్లి చనిపోయింది. 28వ తేదీన పెద్దకర్మ చేస్తున్నాము అంటూ ఏకంగా పోచమ్మ పెద్ద కొడుకు బంధువులందరికీ కార్డులు పంచడం సంచలనంగా మారిపోయింది. ఈ విషయం తెలిసి తల్లి మనసు ఎంతగానో కుమిలిపోయింది. కొడుకు చేసిన పనికి జీర్ణించుకోలేక పోయిన ఆ తల్లి పోలీసులను ఆశ్రయించి తన గోడు వెళ్లబుచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: