కొబ్బరికాయ లోడుతో వెళ్తున్న లారీ.. చెక్ చేసి పోలీసులు షాక్?

praveen
ఇటీవలి కాలంలో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసుల కళ్లుగప్పి ఏదో ఒక విధంగా అక్రమ రవాణా చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కొంతమంది మద్యం అక్రమ రవాణా చేస్తూ ఉంటే.. మరి కొంతమంది మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేయడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇంకొంతమంది భారీగా గంజాయి అక్రమ రవాణా చేస్తూ ఉండటం గమనార్హం. ఇలాంటి నేపథ్యంలోనే అటు పోలీసులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం గా ఉంటున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తూ అక్రమాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్న కేటుగాళ్ల కు షాక్ ఇస్తున్నారు. ఇలా ఇటీవల కాలంలో సినిమాల రేంజ్ లో ఎంతోమంది కేటుగాళ్లు వినూత్నంగా ఆలోచించి అధికారుల కళ్లుగప్పి అక్రమాలకు పాల్పడటానికి ప్రయత్నిస్తున్నారు.



 ఇక్కడ ఇలాంటి అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నించిన కేటుగాళ్లు చివరికి పోలీసులకు దొరికిపోయి కటకటాల పాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలోని మోతుగూడెం పోలీసులు వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే కొబ్బరికాయ లోడుతో అటువైపుగా ఒక వాహనం వచ్చింది. అయితే ఆ వాహనంలో ఉన్న డ్రైవర్ అనుమానాస్పదంగా కనిపించడంతో వెంటనే వాహనాన్ని  నిలిపివేసిన పోలీసులు వాహనంలో తనిఖీలు చేపట్టారు.. కొబ్బరికాయల లోడు ఉందని ఆ డ్రైవర్ మాయమాటలు చెప్పి నమ్మించడానికి  ప్రయత్నించాడు. కానీ అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేసి చూసి ఒక్కసారిగా షాకయ్యారు.



 ఏకంగా వాహనంలో గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. అది కూడా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు వేల కిలోల గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించి షాక్ అయ్యారు. దీని విలువ ఏకంగా రెండు కోట్ల రూపాయలు ఉంటుందని పోలీస్ అధికారులు తెలిపారు. తెలంగాణలోని నాగర్ కర్నూల్ కి చెందిన పర్వతాలు ఒడిశాలోని మల్కన్గిరి కి చెందిన నైని రామారావు అనే ఇద్దరు వ్యక్తులు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఒడిశా నుంచి ఇక ఈ గంజాయిని తెలంగాణ కు తరలించే క్రమంలో పోలీసులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక చెక్ పోస్టుల వివరాలు ఇస్తున్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: