పుట్టింటికి వచ్చిన చెల్లి.. దారుణంగా నరికేసిన అన్న?

praveen
మానవత్వానికి మనీషి కేరాఫ్ అడ్రస్ అని చెబుతూ ఉంటారు. కానీ నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు   చూస్తుంటే మనిషిలో ఆ మానవత్వమే కనుమరుగు అవుతుంది అన్నది అర్ధమవుతుంది. రోజురోజుకు కసాయిగా మారిపోతున్న మనుషులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఏకంగా సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు నేటి రోజులలో జనాలు. జాలి దయ అన్న విషయాన్ని మరిచి చిన్నచిన్న కారణాలకే ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అయితే పరాయి వ్యక్తుల ప్రాణాలు తీయడం విషయంలోనే కాదు ఏకంగా రక్త సంబంధీకుల ప్రాణాలను సైతం తీస్తున్నారు నేటి రోజుల్లో జనాలు.



 దీంతో నేటి రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని విధంగా మారిపోయింది పరిస్థితి. అంతే కాదు ఎప్పుడు ఎవరు ఎటు నుంచి దాడి చేసి ప్రాణాలు తీస్తారో అన్న ఆ భయం అందరిలో పాతుకు పోతుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. అతను రక్తం పంచుకుని పుట్టిన అన్న.. చెల్లికి ఏ చిన్న కష్టం రాకుండా చూసుకోవాలి.. ఏదైనా కష్టం వస్తే నేనున్నాను అంటూ భరోసా ఇవ్వాలి.. రక్తం పంచుకుని పుట్టిన చెల్లి ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. కానీ ఇక్కడ అన్న మాత్రం రక్తం పంచుకుని పుట్టిన చెల్లి రక్తాన్ని కళ్ల చూసాడు. ఏకంగా పుట్టింటికి వచ్చిన చెల్లి ని దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు.


 కర్ణాటకలోని నాలదగొండ పట్టణంలో పట్టణంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది  మహంతేష్ శరణప్ప  అనే వ్యక్తి ఆ ప్రాంతంలో నివాసం ఉంటూ ఉండగా.. ఆయన చెల్లెలు శశికళ  ఇటీవలే పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలోనే ఇక అన్నాచెల్లెళ్ల మధ్య ఏదో విషయం పై వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయాడు మహంతేష్. రక్తం పంచుకుని పుట్టిన చెల్లి అని కూడా చూడకుండా కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఇక రక్తపు మడుగులో తీవ్ర గాయాలపాలైన సదరు మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఆ తర్వాత  కత్తి చేతపట్టుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన మహంతేష్ పోలీసుల ముందు లొంగిపోయాడు. ఇక అరెస్టు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: