ఫేస్బుక్ పరిచయం ప్రాణం మీదికి తెచ్చింది.. తస్మాత్ జాగ్రత్త?

praveen
నేటి రోజుల్లో ఆన్లైన్ ప్రపంచం నడుస్తోంది. ఏది కావాలన్నా ఆన్లైన్ వేదికగానే దొరుకుతున్నాయి. అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ ఇస్తే చాలు కావాల్సినవన్నీ పొందుతున్నారు. అయితే నేటి రోజుల్లో కూడా ఎంతో మధురాను భూతులను పంచే ప్రేమ కూడా ఆన్లైన్ మయం అయిపోయింది. ఎందుకంటే నేటి రోజుల్లో ఆన్లైన్ పరిచయాలు ఆ తర్వాత పరిచయం కాస్త ప్రేమగా మారడం ఎక్కువగా జరుగుతుంది. అయితే ఇలా సోషల్ మీడియా ప్రేమలు ఎన్నో దారుణాలకు కూడా కారణమవుతున్నాయని చెప్పాలి. సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది కేటుగాళ్లు ప్రేమ అనే పేరుతో మాయమాటలు చెప్పి భారీగా డబ్బులు దండుకుని మోసం చేస్తున్నారు.

 మరికొన్ని సార్లు సోషల్ మీడియా ప్రేమలు ప్రాణాల మీదికి తెస్తున్న  సంఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి  ఇక్కడ ఇలాంటిదే జరిగింది ఫేస్బుక్ లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. చివరికి ఆ ప్రేమే యువకుని ప్రాణాల మీదికి తెచ్చింది. ఈ ఘటన మైలవరం జి.కొండూరు లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భవాని పురానికి చెందిన డేవిడ్ విజయవాడలో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు ఉద్యోగం చేస్తున్నాడు. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఓ యువతితో రెండేళ్ల కిందట ఫేస్బుక్ లో అతనికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది.

 అయితే ఇటీవలే సదరు యువతి డేవిడ్ కి ఫోన్ చేసి తాను మామయ్య వాళ్ళ ఇంటి వద్ద ఉన్నానని.. రాత్రి గుంటూరులో పెళ్లికి వెళ్లాల్సి ఉందని తనను తీసుకెళ్లాలి అంటూ కోరింది. ఈ క్రమంలోనే ప్రియురాలు  కోరడంతో కారులో బయలుదేరారు డేవిడ్. పుల్లూరు చేరుకున్న తర్వాత మళ్లీ ఆమెకు ఫోన్ చేసి చిరునామా అడిగాడు. తన సోదరుని పంపిస్తున్నాను అని అతను వచ్చి నిన్ను నా దగ్గరకు తీసుకు వస్తారు అంటూ సదరు యువతి చెప్పింది. ఇంతలో యువతి సోదరుడు తో పాటు మరో వ్యక్తి కూడా డేవిడ్ కారులో ఎక్కారు  ఈ క్రమంలోనే దారిలో డేవిడ్ మెడ చేతులు బ్లెడ్ తో కోసి తీవ్ర గాయాలపాలైన మార్గమధ్యములో అతన్ని పడేసి ఇక బంగారం మొత్తం లాక్కుని కారు తో వెళ్లి మధ్యలో ఆ కారుని వదిలేసారు. అదృష్టవశాత్తు ఆ యువకుడు అతి కష్టం మీద ఇంటికి చేరుకున్నాడు. ఇక కుటుంబ సభ్యుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: