భార్య కాపురానికి రాలేదని.. భర్త ఏం చేసాడో తెలుసా?

praveen
అదేంటోగాని అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ అయిన భార్య భర్తల బంధం లో నేటి రోజుల్లో అదే అన్యోన్యత కరువవుతుంది  .  ఒకరిపట్ల ఒకరు బాధ్యతగా వ్యవహరించాల్సింది పోయి.. దారుణంగా  వ్యవహరిస్తూ సొంత కాపురంలో చిచ్చు పెట్టుకుంటున్నారు ఎంతోమంది. దీంతో భార్యాభర్తల బంధం నేటి రోజుల్లో మనస్పర్థలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అంతేకాదు ఇక భార్య భర్తల బంధం లో తలెత్తిన చిన్నపాటి గొడవలు కారణంగా ఎంతోమంది మనస్థాపం చెంది క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  మూడు ముళ్ళతో ఒకటైన భార్య భర్తల బంధం మూన్నాళ్ళ ముచ్చట అన్న విధంగానే మారిపోతుంది నేటి రోజుల్లో.

సాధారణంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం కామన్.. కానీ చిన్నపాటి గొడవలనే ఎంతోమంది భూతద్దం పెట్టి చూస్తూ ఏకంగా భార్యాభర్తల బంధాన్ని విడిపోయే వరకు తెచ్చుకుంటున్నారు. ఇక మరి కొంతమంది చిన్న విషయాలకే మనస్థాపం చెందుతూ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. పిలిచిన వెంటనే భార్య పుట్టింటి నుంచి కాపురానికి రాలేదు అన్న కారణంతో ఆగ్రహంతో ఊగిపోయాడు భర్త. దీంతో కడవరకు కష్ట సుఖాల్లో తోడు ఉంటాను అంటూ ప్రమాణం చేసినవాడే చివరికి భార్య గొంతు కోసి పరారయ్యాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా సోమల మండలంలో వెలుగులోకి వచ్చింది.

ఉప్పర్ పల్లి పంచాయతీకి చెందిన భాగ్యశ్రీ కి దోమల పల్లికి చెందిన వెంకటాద్రి తో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. వీరి భార్యాభర్తల బంధానికి గుర్తుగా 9 నెలల కుమారుడు కూడా పుట్టాడు. కొన్నాళ్ళ వరకు సాఫీగా సాగిపోయిన వీరి సంసారంలో మనస్పర్థలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తరచూ గొడవలు జరుగుతూ ఉండడంతో ఇటీవలే భార్య భాగ్యశ్రీ పుట్టింటికి వచ్చేసింది. అయితే ఇటీవలే అత్తవారింటికి చేరుకున్న వెంకటాద్రి తనతోపాటు కాపురానికి రావాల్సిందిగా భార్యను కోరాడు. కానీ ఆమె మాత్రం భర్తతో వెళ్లేందుకు ఇష్టపడలేదు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త ఆసుపత్రిలో చూపించుకోని వస్తాము అని నమ్మబలికి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లి మార్గమధ్యంలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ క్రమంలోనే గొంతుకోశాడు. ఇక చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకోవడంతో పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: