బర్త్‌డే పార్టీకి పిలిచి మహిళా డాక్టర్ పై అఘాయిత్యం !!

Surya
మనం ఏ సమాజం లో బ్రతుకుతున్నామో తెలిస్తే  మానవునిగా పుట్టినందుకు పచ్చాత్తాపం కలుగుతుంది. నమ్మిన మనుషులే నిలువునా మోసం చేసే రోజులు దాపురించాయి. దిశా , నిర్భయ చట్టాలు వచ్చి దారుణంగా ఎంకౌంటర్ లు చేస్తున్న బుద్ది రాని ఈ జనాలను యేమని చెప్పాలి. నమ్మించి మోసం చేస్తున్న ఈ కేటుగాళ్లకు ఎలా బుద్ది చెప్పాలి. దేశ రాజధాని క్రైమ్ లకు అడ్డాగా మారుతుంది. బర్త్‌డే పార్టీ కి ఓ సహోద్యోగి డాక్టర్ ఓ లేడీ డాక్టర్ ని పార్టీ కి ఆహ్వానించాడు . కన్నేసిన సీనియర్ డాక్టర్ ఆమె పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగు చుసిన ఈ ఘటన ఢిల్లీ లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) లో వెలుగు చూసింది. 


 ఈ ఘటన హౌజ్ ఖాస్‌ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. సీనియర్ హౌస్ సర్జెన్ గా పనిచేస్తున్న కేటుగాడు అదే హాస్పిటల్ లో జూనియర్ హౌస్ సర్జన్ గా పనిచేస్తున్న ఓ లేడీ డాక్టర్ పై కన్నేశాడు. ఆమె ను లొంగ దీసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసాడు కానీ కుదరక పోవడంతో. అతని జూనియర్ డాక్టర్స్ లో ఒకరిని ఎంచుకొని బర్త్ డే పార్టీ ని అతని ఇంట్లో ప్లాన్ చేసాడు. అతనితో ఆమెకు బర్త్ డే పార్టీ ఇస్తున్నట్లు చెప్పి ఆహ్వానించామని చెప్పాడు. అయితే ఆ సహోద్యోగి డాక్టర్ ఆమెను ఆహ్వానించారు. అతను సహోద్యోగి కావడంతో సరేనని చెప్పి పార్టీ కి వెళ్ళింది. గుంత నక్కలా ఎదురు చూస్తున్న సీనియర్ డాక్టర్ ఆమెకు తెలియకుండా మత్తు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. అది తాగిన తరువాత ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది.


పార్టీ కి వచ్చిన అందరూ వెళ్లిపోయారు ఆమె మాత్రమే అతని ఇంట్లో ఉండిపోయింది . ఇదే అదనుగా భావించిన ఆమె సీనియర్ అపస్మారక స్థితిలో ఉన్న ఆమె పై పలు మార్లు అఘాయిత్యం చేశాడు. మత్తు వదిలినతరువాత ఆమె ఆ గదిలో వివస్త్రగా పడిఉంది. అప్పుడే ఆమెకు బలాత్కరించ బడ్డానని తెలిసి అతడిని నిలదీసింది. ఎవరికైన చెబితే చంపేస్తానని చెప్పి బెదిరించాడు ఆమెను .  చేసేది ఏమిలేక పరువు పోతుందేమో అని కామ్ గా ఉండి పోయింది. ఈ విషయం ను తన స్నేహితులకు చెప్పగా అతడిపై కేసు పెట్టవలసింది గా సూచించారు.



ఘటన జరిగిన ఐదు రోజుల తరువాత దర్యం చేసి అతని పై  హౌజ్ ఖాస్‌ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ లో భాగం గా ఆమెను వైద్య పరీక్షలకు హాస్పిటల్ కు పంపారు. పరీక్షల్లో ఆమె పై అఘాయిత్యం జరిగిందని తేలడంతో ఆ సీనియర్ డాక్టర్ పై  సెక్షన్ 376 మరియు సెక్షన్  377 క్రింద కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీ లో ఉన్నాడు. అయితే లేడీ డాక్టర్ తన పేరు బయటకు రావద్దనడంతో ఆమె పేరును ప్రస్తుతానికి పొలిసు అధికారులు వెల్లడించలేదు. దేశం లో జరుగుతున్న అత్యాచారాల్లో సహోద్యోగి , బంధువు , ప్రేమికుడు  , మోసం , తోబుట్టువులు చేసే ఘోరాలు అధికం అని ఓ నివేదికలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: