కరీంనగర్ బస్టాండ్ నుండి వరంగల్ కు బస్సు బయలుదేరింది. వరంగల్ సమీపించింది బస్ స్టాండ్ కూడా వచ్చేసింది. బస్ స్టాండ్ లో దిగాడు రమేష్. అక్కడే నిలబడి ఉన్న ఒక మహిళను చూశాడు. ఆ మహిళ కూడా రమేష్ ని చూసింది. మొదటి చూపులు కలిశాయి.. ఆ మహిళ కళ్ళల్లో ఏముందో ఏమో రమేష్ కి సైగలు కూడా చేసింది.. దీంతో ఎంతో ఆశతో రమేష్ మనసు ఆనందోత్సాహంలో మునిగిపోయింది. అబ్బా మహిళ పిలిచింది ఇక ఎంజాయ్ చేద్దామని సంబరపడిపోయాడు. ఏమి తెలియని ఆ మహిళతో వెళ్లాడు ఈ వ్యక్తి. తర్వాత జరిగింది ఏంటంటే..? దారి వెంట వెళ్తూ దారిలో వస్తున్న ఆటో ఆపి ఇద్దరూ కలిసి నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. కక్కుర్తిపడి రమేష్ ఆమెపై చేయి వేశాడు. ఇంతలో సీన్ అంతా మారిపోయింది..
ఇంతలో అక్కడికి ఎంట్రీ ఇచ్చారు ఒక వ్యక్తి.. రమేష్ షాకయ్యాడు.. ఆ మహిళ కూడా వెంటనే లేచి ఆ ఎంట్రీ ఇచ్చిన వ్యక్తితో కలిసి రమేష్ దగ్గర ఉన్న బ్యాగును, డబ్బులు ఇతర సామాగ్రిని బెదిరించి మరి పట్టుకొని ఉడాయించారు. వారిద్దరూ ఎవరో కాదు భార్య భర్తలే.. అప్పుడు కాని రమేష్ కు అసలు విషయం అర్ధం కాలేదు. దీంతో లబోదిబోమంటూ రమేష్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రమేష్ అనే వ్యక్తి కరీంనగర్ బస్టాండ్ లో బస్సు ఎక్కి వరంగల్ బస్ స్టాండ్ లో దిగాడు. అప్పటికే ఎవరైనా బకర దొరికితే దోచేద్దామనే ప్లాన్ లో మహిళ బస్టాప్ లో వేచి చూస్తోంది. ఇంతలో బకరా రమేష్ అయ్యాడు.. రమేష్ వైపు అలా చూసింది. రమేష్ కూడా చూసి ఆమెపై ఆశపడ్డాడు. ఇద్దరం కలిసి ఒంటరి ప్రదేశం వెళ్దామని చెప్పడంతో సొల్లు కార్చుకుంటూ వెళ్లాడు రమేష్. అప్పటికే ప్లాన్ మీద ఉన్నటువంటి వీరు రమేష్ వద్దనున్న 70 వేల రూపాయలు, ఉన్నటువంటి బ్యాగు తీసుకొని పరారయ్యారు. దీంతో రమేష్ పోలీసులు ఆశ్రయించాడు.
గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరగడంతో దీనిని పోలీసులు మరింత సీరియస్ గా తీసుకొని సిసి ఫుటేజీలను పరిశీలించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి పేర్లు రాయపురం సరిత 33 ఏళ్లు, రేణిగుంట రాజేష్, అలియాస్ గున్న 36 ఏళ్లు. వీరిద్దరు భార్యాభర్తలు. ఈజీ గా డబ్బులు సంపాదించడం కోసం ఇలాంటి దోపిడీలను వారు ఎంచుకున్నారు. దీంతో నిందితులను అదుపులోకి తీసుకొని పోలీసులు ఇంకెక్కడ దోచుకున్నారో వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు.