అరుస్తున్నాయని 20 కుక్కలకు విషం పెట్టిన వ్యక్తి.. చివరికి..!

MOHAN BABU
 ప్రస్తుత సమాజంలో  మనుషుల కంటే ఎప్పుడు జంతువులకు ఎక్కువగా విలువ  ఇస్తున్నారు. ఇక మన దేశంలో కంటే ఇతర దేశాలలో మాత్రం పెంపుడు జంతువులకు ఇచ్చినంత విలువ మనుషులకు కూడా ఇవ్వరు. వారు వాటిని అంతగా ప్రేమిస్తారు. ఒక్కోసారి పిల్లలను కూడా వాటిని పెంచుకుంటారు. వాటికోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తూ ఉంటారు. ఈ పెంపుడు జంతువుల కొరకు కూడా కోర్టు మెట్లెక్కిన వారున్నారు. ఈ యొక్క జంతువుల్లో అన్నిటికంటే ఎక్కువగా కుక్కలకు విలువ ఇస్తారు. ఎంతగా అంటే మనం ఇక చెప్పలేం. ఏదైనా కుటుంబం లో  మనతో ఉన్న మనిషి చనిపోయినా ఎక్కువ బాధ పడ్డారు కానీ, కుక్కలకు ఏమైనా జరిగితే మాత్రం వారు తట్టుకోలేరు.


వీటికోసం ప్రత్యేకమైన కోర్టులు చట్టాలు కూడా ఉన్నాయి. అయితే ఇంత విలువ  ఉన్నటువంటి పెంపుడు జంతువులను ఈ వ్యక్తి  విషం పెట్టి చంపేశారు. ప్రతిరోజు అరుస్తున్నాయి అని 20 కుక్కలను విషం పెట్టి చంపేశారు. ఈ ఘటన ఒడిస్సా రాష్ట్రం లోని కటక్ జిల్లా లో జరిగింది. ఈ 24  సంవత్సరాల వ్యక్తి ఈ యొక్క ఆగయిత్యాయానికి పాల్పడ్డాడు. అతని మాంసం కొట్టు వద్ద  ప్రతిరోజు రాత్రి  20 వీధి కుక్కలు గుంపులుగా ఉండి తీవ్రంగా ఇస్తున్నాయని ఆయన అన్నారు. దీంతో విసుగు చెంది  విషం పెట్టి ఆ కుక్కలను హతమార్చాడు.


అలా చనిపోయిన 10 కుక్కలను దగ్గరలోని చెత్తకుండీలో పడేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత దగ్గర్లోని శంకర్ పూర్  గ్రామంలో పరిసర కుక్కలు చనిపోవడంతో ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది. దీంతో పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని ప్రశ్నించడంతో వాటిని నేనే  చంపానని చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి పై  జంతువులను క్రూరంగా హింసించి నందుకు అతనిపై కేసు నమోదుచేసి, కుక్కల యొక్క  శాంపిల్స్ ను పరీక్ష కోసం పంపినట్లు పోలీసులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: