యువకుడి కామం.. పిన్నిపై కన్ను.. చివరికి?

praveen
ఆడ పిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు ఎక్కడ తగ్గు ముఖం పట్టడం లేదు. అటు అత్యాచారం చేసిన వారిని శిక్షించేందుకు కఠిన చట్టాలు తీసుకొచ్చినా మార్పు రావడం లేదు. రోజు రోజుకు రెచ్చి పోతున్న కామాంధులు ఆడపిల్ల కనిపిస్తే చాలు దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అయితే మొన్నటి వరకూ పరాయి వ్యక్తుల నుంచి ఇలా లైంగిక వేధింపులు ఎదుర్కొనే వారు మహిళలు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా సొంత వారి నుంచి లైంగిక వేధింపులు ఎదురవుతూ ఉండడం తో ఆడపిల్లలు జీవితం రోజు రోజుకు మరింత ప్రశ్నార్థకం గా మారి పోతోంది.

 ఏకంగా ఇంట్లో వాళ్లే కామాంధులు గా మారి పోయి వేధిస్తూ ఉంటే ఆ బాధ ఎవరికి చెప్పు కోవాలో తెలియక ఆడపిల్ల తనలో తానే కుమిలిపోయే దుస్థితి నేటి రోజుల్లో నెలకొంది. ఇలా  సొంతవారే మహిళల పై అత్యాచారానికి పాల్పడుతూన్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి.  రోజురోజుకు ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. అమ్మ తర్వాత అమ్మ లాంటి పిన్నిపై కామం తో ఊగిపోయాడు ఆ యువకుడు. చివరికీ ఏకంగా అత్యాచార యత్నం చేశాడు.

 ఈ ఘటన మెదక్ జిల్లాలో వెలుగు లోకి వచ్చింది  మనోహరాబాద్ మండలం పోచారం లో దారుణ ఘటన స్థానికులను స్థానికులు అందరినీ షాక్ కి గురి చేసింది. గ్రామానికి చెందిన ఓ మహిళ పై కుమారుడు వరుస అయ్యే  యువకుడు అత్యాచార యత్నం చేశాడు. కుచారానికి  చెందిన వివాహిత అదే గ్రామంలో వరుసకు అక్క మరో మహిళ ఇంటికి వెళ్ళింది. అయితే సదరు మహిళ కుమారుడు పిన్ని వరుస అవుతుంది అని కూడా చూడకుండా అత్యాచారయత్నం చేసాడు. ఇక మహిళా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: