వీడు మనిషా పశువా.. కన్నతండ్రి అయ్యుండి?

praveen
నేటి రోజుల్లో అసలు ఆడపిల్లలకు రక్షణ ఎక్కడుంది.. ఇంటి నుంచి కాలు బయట పెడితే చాలు అటు ఆకతాయిలు మానవమృగాలుగా మారిపోయి కామపు చూపులతో చూస్తూ  సూటిపోటి మాటలతో ఆడపిల్లను ఏడిపిస్తూనే ఉంటారు. పాఠశాలకు వెళితే బాధ్యతగా ఉండాల్సిన ఉపాధ్యాయులు కూతురు వయస్సున్న విద్యార్థులపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఇక ఉద్యోగానికి వెళితే మంచి వాళ్ళం అని ముసుగు వేసుకున్న సహోద్యోగులు  సమయం చూసి చివరికి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇక అన్ని దాటుకుని ఇంటికి వచ్చి కాస్తయినా రక్షణ పొందుదాం అనుకుంటే ఇంట్లో ఉన్న కన్నవాళ్లే ఆడపిల్లల పాలిట శాపంగా మారిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 ఎలాంటి కష్టం వచ్చినా నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చి..  అల్లారుముద్దుగా చూసుకోవాల్సిన కన్నతండ్రి  ఏకంగా కన్నకూతురిపైనే కామం పెంచుకుంటే సభ్య సమాజం మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేటి రోజుల్లో ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి.  ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా కన్న కూతురికి పైన కామంతో ఊగిపోయిన తండ్రి బలవంతంగా ఏడాదిన్నరగా అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. ఇక ఈ విషయం ఇటీవలి బయటకి రావడంతో తండ్రిని పోలీసులు అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

 విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 35 సంవత్సరాల వయసున్న వ్యక్తి వృత్తి రీత్యా ఫిజియోథెరపిస్ట్ గా జీవనం సాగిస్తున్నాడు. అతనికి 13 ఏళ్ల కుమార్తె 11 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నారు. కుమార్తె ప్రైవేట్ పాఠశాలలో 7వ తరగతి విద్యనభ్యసిస్తుంది. అయితే కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి కన్నకూతురిపైనే కామం పెంచుకున్నాడు  మూడేళ్ల కూతురు ని లైంగికంగా వేధిస్తూ వస్తున్నాడు. భార్య నిద్రపోయే సమయంలో పడుకున్న కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇక భార్య ఇంట్లో లేనప్పుడు  అత్యాచారం చేస్తూ వస్తున్నాడు. ఇటీవలే తండ్రి నుంచి వేధింపులు భరించలేని కుమార్తె ఇక్కడ ఉండలేనని నాన్నమా ఇంటికి వెళ్ళిపోతాను అంటూ చెప్పింది. అనుమానం వచ్చిన తల్లి నిలదీయడంతో అసలు విషయం బయట పెట్టింది. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: